కౌంటింగ్ ఎఫెక్ట్... రేపు లిక్కర్ షాపులు బంద్... రోజంతా లేనట్లే...

Election Counting Results 2019 : మందు బాబులకు ఏం ఉన్నా లేకపోయినా, చేతిలో ఓ బాటిల్ వుంటే చాలు... అదే స్వర్గం. కానీ గురువారం వాళ్లకు మందు కటకటే...

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 2:54 PM IST
కౌంటింగ్ ఎఫెక్ట్... రేపు లిక్కర్ షాపులు బంద్... రోజంతా లేనట్లే...
లిక్కర్ (File Image)
  • Share this:
ఓవైపు ఎన్నికల ఫలితాలు తెలుసుకుంటూ... ఓ పక్క నుంచీ చికెనో, మటనో లాగిస్తూ... మరో పక్క నుంచీ మద్యం బాటిల్ పైకెత్తుతూ... గటగటా తాగుతుంటే ఆ కిక్కే వేరంటారు మందుబాబులు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం... మద్యపాన ప్రియులకు చేదు వార్త చెప్పింది. కౌంటింగ్ రోజున అంటే గురువారం ఉదయం 6 గంటల నుంచీ శుక్రవారం ఉదయం 6 గంటల వరకూ మద్యం షాపులు తెరవకూడదని ఆర్డరేసింది. ఫలితంగా కౌంటింగ్ రోజున లిక్కర్ దొరకనట్లే. ఐతే... ప్రతి దానికీ ఆల్టర్నేట్ ప్లాన్ ఉంటుందంటున్న లిక్కర్ లవర్స్... ఇవాళే రెండ్రోజులకు సరిపడా మందు కొనేసుకుంటాం అని అంటున్నారు. కౌంటింగ్ రోజున మందు, ముక్క లేకపోతే, ముద్ద దిగదని అంటున్నారు. ఫలితాలు తెలుసుకుంటూ... తాగుతుంటే... స్వర్గం కనిపిస్తుందని చెబుతున్నారు. ఈసీ మాత్రం ఉద్రిక్త పరిస్థితులు, అల్లర్ల వంటివి జరగకూడదన్న మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

లిక్కర్ షాపులు బిజీ బిజీ : ఈసీ అలాంటి నిర్ణయం తీసుకుంటుందని మందుబాబులు ముందే ఊహించారేమో. ఇవాళ మధ్యాహ్నం నుంచీ లిక్కర్ షాపుల ముందు క్యూ పెరిగిపోయింది. చాలా మంది కేసులకు కేసులు పట్టుకుపోతున్నారు. ఎక్కువ మంది కొంటున్నది మాత్రం బీరే. అదైతే ఎక్కువ కిక్కు ఇవ్వదనీ, అందువల్ల తాగుతూనే ఫలితాలు తెలుసుకుంటూ ఉండొచ్చనీ చెబుతున్నారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమైనా... కౌంటింగ్ రోజున మాత్రం ఆరోగ్యం పాడుచేసుకొనైనా మద్యం తాగితీరాల్సిందే అంటున్నారు. అందులో ఉన్న కిక్కు ఎందులోనూ రాదంటున్నారు లిక్కర్ లవర్స్.

అమరావతి, విజయవాడలో పెరిగిన డిమాండ్ : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి కావడం, హైదరాబాద్‌లో ఉంటున్న చాలా మంది ఏపీ నేతలు... అమరావతికి క్యూ కట్టడంతో... ఇప్పుడు అక్కడ మద్యానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలా మంది నేతలు, తాము కచ్చితంగా గెలుస్తామనీ, పార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుగానే ఆర్డర్లు ఇచ్చి ఇప్పటికే లక్షల కేసులు కొనేశారు. బుధవారమైతే... మద్యం నిల్వలన్నీ అయిపోయాయట. స్టోర్ పెట్టిన కేసులన్నీ కొనేయడంతో... అప్పటికప్పుడు వేరే ప్రాంతాల నుంచీ తెప్పించాల్సిన పరిస్థితి తలెత్తిందట. ఇంకా కొన్ని గంటలే టైమ్ ఉండటంతో... ఆ లోపే వీలైనంత మద్యం కొనేసేందుకు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు.

ఈసీ లిక్కర్ షాపులను 24 గంటలు మూసేయాలని ఆర్డరేస్తే... ఆ 24 గంటలకూ సరిపడా మద్యాన్ని ముందే కొనేసుకుంటున్నారు లిక్కర్ లవర్స్. అందువల్ల ఈసీ అనుకున్నట్లు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే, అందుకు మద్యం కారణం కాదని అనుకోలేం. పోలీసులు మాత్రం మద్యం దుకాణాలు, బార్లు, వైన్‌ షాపులు, కల్లు దుకాణాలన్నింటికీ ఈసీ రూల్స్ వర్తిస్తాయని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండి :

గ్రేటర్‌లో గెలుపెవరిది... ఫస్ట్ రిజల్ట్ హైదరాబాద్‌దే...ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా... పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు...

గోవాలో రష్యా మహిళపై అఘాయిత్యం... బైక్‌పై వెంటాడి... పగబట్టి...

కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య... రాడ్లు, కర్రలు, బండరాళ్లతో....
First published: May 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు