‘హుజూరాబాద్’ చిన్న విషయం.. అసలు ఆ పేరు రాలేదన్న మంత్రి కేటీఆర్.. ఇంకా ఏం చెప్పారంటే..

కేటీఆర్​ (ఫైల్​)

Telangana: హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ వచ్చిన తరువాత దీనిపై కూర్చుని మాట్లాడతామని మంత్రి కేటీఆర్ అన్నారు.

 • Share this:
  ఈ రోజు జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రెండున్నర గంటలు సాగిన ఈ సమావేశంలో అసలు హుజూరాబాద్ అనే మాటే రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఏర్పడిన తరువాత ఎన్నో ఎన్నికలు, ఉప ఎన్నికలు ఎదుర్కొందని.. అందులో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒకటని కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ వచ్చిన తరువాత దీనిపై కూర్చుని మాట్లాడతామని అన్నారు. పని చేసే ప్రభుత్వానికి, పార్టీకి ప్రజల మద్దతు కచ్చితంగా ఉంటుందనే నమ్మకం తమకు ఉందని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

  రెండు దశాబ్దాల చరిత్రలో టీఆర్ఎస్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్, వరంగల్ మినహా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలను దసరా రోజు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఢిల్లీలో టీఆర్ఎస్ భవనానికి సెప్టెంబర్ 2న భూమి పూజ కేసీఆర్ చేస్తారని వెల్లడించారు.ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా హాజరవుతారన్నారు. సెప్టెంబర్ 2న గ్రామ కమిటీల నిర్మాణం చేపడతామన్నారు. మండల, పట్టణ, వార్డు మున్సిపల్, జిల్లా కమిటీలు కూడా సెప్టెంబర్‌లోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు కమిటీలు వేసే బాధ్యతలు అప్పగిస్తామన్నారు.నవంబర్‌లో టీఆర్ఎస్ ద్విధాశాబ్ధి వార్షికోత్సవ సభను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. కొత్త కార్యవర్గం వార్షికోత్సవ సభ తేదీని నిర్ణయిస్తుందన్నారు.

  జీహెచ్ఎంసీ మేయర్‌ తీరుపై టీఆర్ఎస్‌లో అసంతృప్తి.. రంగంలోకి దిగిన సీనియర్ నేత

  హుజూరాబాద్‌ ఎఫెక్ట్.. నేతలకు వరుస పదవులు.. క్యూలో ఇద్దరు మాజీమంత్రులు ?

  కరెంటు, తాగునీళ్లు ఇవ్వని దద్దమ్మలు కూడా ఈ రోజు దళిత బంధు మీద మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పేదరిక నిర్మూలన దారిద్ర్య రేఖకు దిగువ నుంచే మొదలవుతుందన్నారు. దళితులే కడు పేదరికంలో ఉన్నారన్నారు. వారిని పైకి తెచ్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని చెప్పారు. 20రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ 4రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ కూడా దమ్ముంటే దళిత బంధు తీసుకురావాలని సవాల్ విసిరారు. పనికిమాలిన ప్రతిపక్షాల పిచ్చి ప్రేలాపణలు పట్టించుకోమని కేటీఆర్ అన్నారు.

  అంతకుముందు జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర‌స్థాయి శాఖ‌ల పునర్నిర్మాణం వ‌ర‌కు స‌మావేశంలో చ‌ర్చించారు. అదేవిధంగా దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ చేయాల్సిన కృషిపై సీఎం కేసీఆర్ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ద‌ళిత బంధుపై ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేయాల‌న్నారు. ప్ర‌తిప‌క్షాల త‌ప్పుడు విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. ద‌ళిత‌బంధును ఉద్య‌మంలా చేయాల‌న్నారు. ద‌శ‌ల‌వారీగా స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌కు న్యాయం చేస్తామ‌న్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: