ట్రంప్-మోదీ మధ్య ఆ ప్రస్తావనే రాలేదు : లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్

కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ తీరును తప్పు పడుతూ ట్రంప్ వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చారు.G20 సదస్సు సందర్భంగా మోదీ-ట్రంప్ మధ్య కశ్మీర్ గురించి అసలు ప్రస్తావనే రాలేదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

news18-telugu
Updated: July 24, 2019, 3:57 PM IST
ట్రంప్-మోదీ మధ్య ఆ ప్రస్తావనే రాలేదు : లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్
లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్
news18-telugu
Updated: July 24, 2019, 3:57 PM IST
కశ్మీర్ సమస్య విషయంలో భారత్-పాక్ మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వానికి తావు లేదన్నారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి మోదీ అమెరికా మధ్యవర్తిత్వాన్ని కోరారని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్.. ప్రధాని నుంచి వివరణ కోరుతోంది. కేంద్రమంత్రి జైశంకర్ ఇదివరకే దీనిపై వివరణ ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందని కాంగ్రెస్..మోదీ లోక్‌సభలో వివరణ ఇవ్వాలని పట్టుబడుతోంది. అయితే బుధవారం కూడా ఆయన సభకు రాకపోవడంతో కాంగ్రెస్ వాకౌట్ చేసింది. దీంతో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ తీరును తప్పు పడుతూ ట్రంప్ వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చారు.G20 సదస్సు సందర్భంగా మోదీ-ట్రంప్ మధ్య కశ్మీర్ గురించి అసలు ప్రస్తావనే రాలేదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కశ్మీర్ విషయంలో ఎలాంటి మధ్యవర్తిత్వానికి తావు లేదన్నారు. ఇది భారత జాతీయతకు సంబంధించిన విషయమని.. ఇందులో ఇంకొకరి ప్రమేయాన్ని తాము కోరుకోవడం లేదన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభ దద్దరిల్లిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రమంత్రి జైశంకర్ వివరణ ఇచ్చారు.కాంగ్రెస్ మాత్రం ప్రధాని మోదీనే దీనికి సమాధానం
చెప్పాలని డిమాండ్ చేసింది.మోదీ సభకు వచ్చి ట్రంప్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పట్టుబట్టింది. బుధవారం కూడా ఆయన సభకు రాకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేసింది.First published: July 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...