రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్ సింగ్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి ప్రతిపక్షాలు. ప్రతిపక్షాలకు చెందిన 47 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.

news18-telugu
Updated: September 20, 2020, 9:02 PM IST
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం
హరివంశ్ సింగ్ (File)
  • Share this:
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్ సింగ్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి ప్రతిపక్షాలు. ప్రతిపక్షాలకు చెందిన 47 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. రాజ్యసభలో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న అంశాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోకుండా ఏక పక్షంగా వ్యవసాయ బిల్లులను ఆమోదింపజేశారంటూ డిప్యూటీ చైర్మన్ మీద ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశ పెట్టడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ వ్యవహారం సెటిల్ అయ్యే వరకు హరివంశ్ సింగ్ సభను నిర్వహించడానికి వీల్లేదు. ‘రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తన విధి నిర్వహణలో ఎలాంటి మైండ్ అప్లై చేయకుండా, సభ్యులు కోరిన తరహాలో ఓటింగ్, (డివిజన్) నిర్వహించలేదు. కోవిడ్ 19 నిబంధనలను కూడా అమలు చేయలేదు. శానిటైజేషన్ చేయడానికి సరిపడిన సమయం కూడా ఇవ్వలేదు.’ అని సభ్యులు ఆరోపించారు. సభలో ప్రతిపక్షాలకు చెందిన సభ్యుల కంటే కూడా ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని అనుమతిచ్చారని మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులకు సంబంధించి ప్రతిపక్ష సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశ0 కూడా ఇవ్వలేదని ఆరోపి0చారు.

రాజ్యసభలో ఆదివారంనాడు వ్యవసాయ బిల్లులు ప్రవేశపెడుతుండగా జరిగిన గలభాపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు అసంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై తన నివాసంలో వెంకయ్యనాయుడు ఉన్నత స్థాయి సమావేశం జరిపారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమాశంలో పాల్గొన్నారు. దీనికి ముందు, రాజ్యసభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పోడియం మైక్ లాక్కునేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్, కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోర, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ ప్రయత్నించడం కనిపించింది. పలువురు ఎంపీలు డిప్యూటీ చైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, బిల్లు ప్రతులను చించేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 20, 2020, 8:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading