హోమ్ /వార్తలు /politics /

Big Shock to TDP: టీడీపీకి బిగ్ షాక్.. ఉన్న ఒక్కటీ పోయింది.. కొంప ముంచిన తెలుగు తమ్ముళ్లు

Big Shock to TDP: టీడీపీకి బిగ్ షాక్.. ఉన్న ఒక్కటీ పోయింది.. కొంప ముంచిన తెలుగు తమ్ముళ్లు

కాకినాడ మేయర్ కి షాక్

కాకినాడ మేయర్ కి షాక్

Big Shock to TDP: వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న టీడీపీకి మరో షాక్ తగిలింది. ఈ సారి తెలుగు తమ్ముళ్లే ఆ పార్టీ కి షాక్ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో టీడీపీకి మిగిలిన ఏకైక కార్పొరేషన్ కాకినాడ చేజారిపోయింది. సొంత పార్టీకి చెందిన మేయర్ పై టీడీపీ కార్పొరేటర్లు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 21 మంది టీడీపీ కార్పరేటర్లకు మద్దతుగా వైసీపీ మంత్రి కన్నబాబు, ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు ఓట్లు వేశారు.

ఇంకా చదవండి ...

  No confidence Motion Against kakinada Mayor:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తీవ్ర ఉత్కంఠ రేపిన పొలిటికల్ డ్రామాకు తెరపడింది. గత ఇరవై రోజులుగా వ్యూహప్రతి వ్యూహాలతో రాజకీయ మలుపులు తిరిగిన కాకినాడ మేయర్‌ (Kakinad Mayor) మార్పు ఘట్టానికి మంగళవారంతో తెరపడింది. కాకినాడ నగర మేయర్‌ సుంకర పావని (Sunkara Pavani) పై అవిశ్వాస తీర్మాన సమావేశం ఉదయం 11 గంటలకు జరిగింది. ఇందులో మేయర్‌కు వ్యతిరేకంగా 36 ఓట్లు వచ్చాయి. ముఖ్యంగా 21 మంది టీడీపీ కార్పొరేటర్లు (Tdp corporaters) మేయర్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. వీరికి తోడుగా ఎక్స్ అఫిషియో ఓటర్లుగా మంత్రి కన్నబాబు(Minster Kannababiu), ఎంపీ వంగ గీత (MP Vanga Geeta), ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (MLA

  Dwarampudi Chandra Sekhar Reddy) లు కూడా ఓట్లేశారు. కేవలం 9 మంది టీడీపీ కార్పొరేటర్లు తటస్థంగా ఉండిపోయారు. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో టీడీపి (TDP)కి మిగిలిన ఏకైక మేయర్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకున్నట్లయ్యింది. అయితే కొత్త మేయర్ ఎవరనేది ప్రకటించొద్దని ఇప్పటికే హైకోర్టు తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే.. అధిష్టానం విప్ జారీ చేసినప్పటికీ టీడీపీ కార్పొరేటర్లు ధిక్కరించి మరీ ఓటు వేయడం గమనార్హం. కార్పొరేటర్లు ఇలా చేయడం అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

  నాలుగేళ్ల పదవీకాలం పూర్తయిన తరువాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను మార్చేందుకు గత ప్రభుత్వంలో చట్టం చేయడంతో ఈ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మెజారిటీ కార్పొరేటర్లు గెలుపొందారు. దీంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు టీడీపీకి దక్కాయి. తదనంతరం అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో కాకినాడలో రాజకీయ సమీకరణలు మారాయి.

  ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్.. 805 కోట్ల బిల్లులను తిప్పి పంపిన కేంద్రం

  2017లో జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 50 డివిజన్లకుగాను 48 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 32 టీడీపీ, 10 వైసీపీ, 03 బీజేపీ, 03 ఇండిపెండెంట్లు గెలుపొందారు. అప్పట్లో ఇండిపెండెంట్‌లు అందరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మేయర్‌ వ్యవహారశైలి నచ్చక కొందరు టీడీపీ కార్పొరేటర్లు విభేదించారు. ఈ పరిణామాలు తారస్థాయికి చేరి మొత్తం టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌కు దూరమయ్యారు. రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికల సమయంలో 21 మంది టీడీపీ కార్పొరేటర్లు తమను ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లుగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇదిలా ఉండగా టీడీపీలో గెలిచి ఆ పార్టీ ఓటమి పాలైన వెంటనే అధికార పార్టీతో చేతులు కలిపిన ఘటనలే.. మేయర్‌ను ఒంటరిని చేశాయనే కోణంలో చర్చ సాగింది.

  ఇదీ చదవండి: ఆశలు రెట్టింపు చేస్తున్న బంతి పూల సాగు.. ఎకరానికి ఎన్ని లక్షలు సంపాదించొచ్చో తెలుసా..?

  మార్పుపై గురి..!

  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు కార్పొరేటర్లను తీసుకుని సిటీ ఎమ్మెల్యేను కలవడం అప్పట్లో దుమారం రేపింది. నాలుగేళ్లు పూర్తయిన తర్వాత పదవి నుంచి దించేస్తారనే ప్రచారం రెండేళ్ల కిందట నుంచే విస్తృతంగా ప్రచారం సాగింది. దీంతో పదవి కాపాడుకోవడం కోసం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మేయర్‌పై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లంతా ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి వర్గంగా ఏర్పడడంతో మేయర్‌ మార్పుపై గురిపెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ద్వారంపూడి ఆధ్వర్యంలోని టీడీపీ కార్పొరేటర్లు.. మేయర్‌, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస సమావేశం ఏర్పాటుచేయాలంటూ కలెక్టర్‌ను కోరడంతో అవిశ్వాస తీర్మాన సమావేశం పెట్టారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kakinada, TDP, Ycp

  ఉత్తమ కథలు