Home /News /politics /

NO COMPROMISE ON PADDY AND OTHER ISSUES RAISE TELANGANA VOICE IN PARLIAMENT SAYS CM KCR TO TRS MPS IN TRSPP MKS

cm kcr : ఇక ఢిల్లీలో దబిడి దిబిడే -ఓపిక పట్టంది చాలు.. గట్టిగా కొట్లాడండి -మోదీ సర్కారును ఎండగట్టండి..

ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

తెలంగాణలో ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని కేంద్రం ఎంత మేరకు కొంటుందో స్పస్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో ధర్నా చేసిన సీఎం కేసీఆర్.. తాడో పేడో తేల్చుకుంటానంటూ ఢిల్లీకి వెళ్లినా కేంద్రం పెద్దలెవరినీ కలవకుండానే తిరిగొచ్చేశారు. అయితే, వరి పోరును మరింత ఉధృతం చేశారు..

ఇంకా చదవండి ...
తెలంగాణ ధాన్యం కొనుగోలు, నీటి వాటాలు, విభజన హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య ఇన్నాళ్లూ మీడియా వేదికగా సాగిన యుద్ధం ఇక ప్రత్యక్షంగా జరుగనుంది. ఢిల్లీలో తెలంగాణ (Telangana)వాణిని బలంగా వినిపించాలని, పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు గట్టిగా కొట్లాడి మోదీ (PM Modi) సర్కారును ఎండగట్టాలని గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (parliament winter session) సోమావారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రగతి భవన్ వేదికగా ఆదివారం నాడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తన అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీఎం కేసీఆర్ ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పీపీ భేటీ విశేషాలివే..

తెలంగాణలో ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని కేంద్రం ఎంత మేరకు కొంటుందో స్పస్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో ధర్నా చేసిన సీఎం కేసీఆర్.. తాడో పేడో తేల్చుకుంటానంటూ ఢిల్లీకి వెళ్లినా కేంద్రం పెద్దలెవరినీ కలవకుండానే తిరిగొచ్చేశారు. అయితే, వరి పోరును మరింత ముందుకు తీసుకెళుతూ, పార్లమెంట్ సమావేశాల సాక్షిగా ఢిల్లీలో తెలంగాణ గొంతుక గట్టిగా వినిపించేలా కేసీఆర్ వ్యూహాలను సిద్దం చేశారు. ధాన్యం కొనబోమని ఎక్కడా అనలేదన్న కేంద్రం.. ఎంత కొంటారనేదానిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించింది. ఈ పరిస్థితికి కారణమైన మోదీ సర్కారును పార్లమెంటులో ఎండగట్టాలని టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు సీఎం కేసీఆర్.

cm kcr : మోదీ సర్కారును అక్కడ ఇరుకున పెట్టేలా.. సీఎం కేసీఆర్ కీలక దిశానిర్దేశం!



పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర సమస్యలపై ఎంపీలు గట్టిగా పోరాడాలని, తెలంగాణకు రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, రైతాంగ సమస్యలపై కేంద్ర తీరును ఎండగట్టాలని టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలన్న ఆయన.. ఇప్పటికే ఈ విషయంలో చాలా ఓపిక పట్టామని, దీనిపై ఉభయ సభల్లో కేంద్రాన్ని ప్రశ్నించాచాలని అన్నారు. అదే సమయంలో

sex doll : రెండో సెక్స్ డాల్ భార్యతో హనీమూన్ -ఆ దెబ్బకు మొదటి భార్య ఢమాల్ -వీడి ప్లాన్ మామూలుగా లేదు..


పంటలకు కనీస మద్ధతు ధర చట్టం, విద్యుత్‌ చట్టాల రద్దు కోసం టీఆర్ఎస్ ఎంపీలు పోరాడాలని, కృష్ణా జలాల్లో రాష్ర్ట వాటాకోసం పట్టుబట్టాల, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు అన్నింటిపై పార్లమెంటల్‌లో తెలంగాణ వాణి వినింపించాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందడం లేదన్న సీఎం.. ఈ సారి ఎలాగైనా కేంద్రం విభజన చట్టంలోని హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలను ఆదేశించారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Paddy, Parliament Winter session, Pm modi, Telangana, Trs

తదుపరి వార్తలు