18 ఆవులు, రెండు ఎద్దులు.. మాజీ ప్రధాని మనవడి ఆస్తుల వివరాలు..

మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ కంచుకోట లాంటి హసన్ నియోజకవర్గంలో రేవణ్ణ పోటీ చేస్తున్నారు.

news18-telugu
Updated: March 29, 2019, 7:21 PM IST
18 ఆవులు, రెండు ఎద్దులు.. మాజీ ప్రధాని మనవడి ఆస్తుల వివరాలు..
రేవణ్ణ నామినేషన్ సందర్భంగా హాజరైన కర్ణాటక సీఎం కుమారస్వామి
  • Share this:
ఆయన తాతా ఓ మాజీ ప్రధాని, బాబాయ్ ప్రస్తుత సీఎం, నాన్న రాష్ట్ర మంత్రి. అయినా సరే ఆయన వద్ద కనీసం కారు కూడా లేదట. ఆయన వద్ద 18 ఆవులు, రెండు ఎద్దులు ఉన్నాయట. ఈ విషయాన్ని అధికారికంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు. కర్ణాటక మంత్రి రేవణ్ణ కుమారుడు రేవణ్ణ. హసన్ లోక్‌సభ నియోజకవర్గానికి జేడీఎస్ అభ్యర్థిగా రేవణ్ణ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 28 ఏళ్ల రేవణ్ణ తన ఆస్తులు, అప్పుల వివరాలను అందులో పొందుపరిచారు. తనకు రూ. 1,64,86,632 విలువైన చరాస్తులు ఉన్నట్టు తెలిపారు. సొంత కారు లేదు. కానీ, ట్రాక్టర్ మాత్రం ఉంది. దాన్ని ఆయన 2015లో కొనుగోలు చేసినట్టు తెలిపారు. రేవణ్ణకు 18 ఆవులు, రెండు ఎద్దులు ఉన్నాయి. వాటి విలువ రూ. 4,45,000గా పేర్కొన్నారు.

రేవణ్ణ స్థిరాస్తుల్లో వ్యవసాయ భూమి ఎక్కువగా ఉంది. 17 ప్లాట్లు కూడా ఉన్నాయి. తండ్రి రేవణ్ణ బహుమతిగా ఇచ్చిన నాలుగు ఎకరాల ప్లాట్ కూడా అందులో ఒకటి. మైసూర్‌లోని చెన్నాంబికా ఫంక్షన్ హాల్లో వాటా ఉంది. రేవణ్ణ స్థిరాస్తుల మొత్తం విలువ రూ.4.89,15,029 తెలిపారు. రేవణ్ణ అప్పులు రూ.3,72,53,210. మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ కంచుకోట లాంటి హసన్ నియోజకవర్గంలో రేవణ్ణ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరి టికెట్ సాధించిన ఏ.మంజుతో రేవణ్ణ తలపడనున్నారు.

First published: March 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు