బీజేపీతో పొత్తుపై చంద్రబాబు లీక్స్... కాషాయ నేతల ఘాటు కౌంటర్

సునీల్ దియోధర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే టీడీపీ ఓవైపు బీజేపీతో పొత్తుకు అర్రులు చాస్తూనే మరోవైపు ఆ పార్టీలో చేరాలనుకునే నేతలకు అడ్డుపుల్ల వేస్తున్నట్లు అర్ధమవుతోంది.

news18-telugu
Updated: October 13, 2019, 7:39 PM IST
బీజేపీతో పొత్తుపై చంద్రబాబు లీక్స్... కాషాయ నేతల ఘాటు కౌంటర్
అమిత్ షా, చంద్రబాబు
news18-telugu
Updated: October 13, 2019, 7:39 PM IST
ఎన్డీయే నుంచి వైదొలగడం, బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలతో కలిసి గ్రూపులు కట్టడం తనను అధికారం నుంచి దూరం చేశాయన్న సత్యాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఆలస్యంగానైనా గుర్తించినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలతో కాషాయ నేతలు కూడా అప్రమత్తమయ్యారు. టీడీపీకి ద్వారాలు ఎప్పుడో మూసేశామంటూ ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ సహా కాషాయ నేతలంతా స్పష్టం చేస్తున్నారు. ఏపీలో ఓవైపు వరుసగా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న జగన్ తమను టార్గెట్ చేస్తాడేమోనన్న భయం, కేంద్రంతో గతంలో సాగించిన యుద్దం నేపథ్యంలో మళ్లీ కాషాయ నేతలు తనను కరుణిస్తారో లేదోనన్న ఆందోళన టీడీపీ అధినేత చంద్రబాబులో రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అసలే టార్గెట్ 2024 లక్ష్యంగా జోరు పెంచుతున్న బీజేపీకి దగ్గరవడం ద్వారా ఏపీలో పునర్ వైభవం సాధించాలన్న ఆలోచనలో పడిన చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే బీజేపీ హైకమాండ్ లో చక్రం తిప్పుతున్న పలువురు నేతలకు సానుకూల సంకేతాలు పంపినా కరుణించే పరిస్ధితి లేకపోవడంతో ఇక నేరుగా తానే రంగంలోకి దిగాలని చంద్రబాబు భావించినట్లు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోంది.

BJP leader Sunil Deodhar sensational comments on Chandra babu
బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ దేవధర్


2019 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసి తప్పుచేసినట్లు నేతల వద్ద వాపోయిన చంద్రబాబు.... ఇప్పటికైనా అవకాశం లభిస్తే కాషాయ పార్టీతో జట్టు కడదామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.కానీ బీజేపీ అధినాయకత్వం అభిప్రాయం మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఘోరపరాజయం పాలవడం, జగన్ దూకుడు నేపథ్యంలో టీడీపీ పరిస్ధితి దారుణంగా ఉందని బీజేపీ భావిస్తోంది. అసలే 2024 ఎన్నికల్లో సత్తా చాటాలన్న దృక్పథంతో ఉన్న కాషాయ నేతలు.. ఇప్పుడిప్పుడే టీడీపీని చేరదీస్తే ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా వెళ్లినట్లు అవుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. గత ఎన్నికల ముందు సాధారణ కార్యకర్త నుంచి ప్రధాని మోదీ వరకూ టీడీపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన బీజేపీ నేతలు.. ఇప్పుడు అదే పార్టీతో జతకట్టాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతల సమావేశం సందర్భంగా చంద్రబాబు ప్రస్తావన వచ్చినప్పుడు అమిత్ షా... టీడీపీకి తాము ద్వారాలు పూర్తిగా మూసేసినట్లు స్పష్టత ఇచ్చారు. భవిష్యత్తులో పరిస్ధితి ఎలా ఉన్నా ప్రస్తుతానికి అమిత్ షా వ్యాఖ్యలనే రాష్ట్ర బీజేపీ నేతలు ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ కూడా సోషల్ మీడియా వేదికగా అమిత్ షా వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.

అవినీతి చంద్రబాబు అబద్దాల కోరు కూడా. బీజేపీతో తమ పార్టీ త్వరలో పొత్తు పెట్టుకుంటున్నందున టీడీపీ నేతలెవరూ ఆ పార్టీలో చేరొద్దంటూ చంద్రబాబు చెబుతున్న మాటలే దీనికి నిదర్శనం. టీడీపీతో పొత్తుకు ద్వారాలు శాశ్వతంగా మూసుకుపోయినట్లు అమిత్ షా ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో బీజేపీ-టీడీపీ పొత్తు ఉండే అవకాశమే లేదు.


సునీల్ దియోధర్, బీజేపీ ఏపీ వ్యవహారాల బాధ్యుడు


సునీల్ దియోధర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే టీడీపీ ఓవైపు బీజేపీతో పొత్తుకు అర్రులు చాస్తూనే మరోవైపు ఆ పార్టీలో చేరాలనుకునే నేతలకు అడ్డుపుల్ల వేస్తున్నట్లు అర్ధమవుతోంది. దీంతో ఇప్పుడు బీజేపీ కూడా చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉండబోదని స్పష్టత ఇవ్వడం ద్వారా ఆ పార్టీ నుంచి నేతల వలసలను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో కాషాయ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
Loading...
పవన్ కళ్యాణ్ హరిద్వార్ టూర్

First published: October 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...