• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • NO ALLIANCE BETWEEN BJP AND YSRCP PAWAN KALYAN CLARIFIES IN AMARAVATI BA

BJP-YCP Alliance | బీజేపీ - వైసీపీ పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు...

BJP-YCP Alliance | బీజేపీ - వైసీపీ పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు...

రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.

బీజేపీ, వైసీపీ మధ్య పొత్తు లేదని, అలాంటి పరిస్థితులు కూడా లేవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇది కేవలం వైసీపీ చేస్తున్న ప్రచారమేనని తేల్చి చెప్పారు.

  • Share this:
    బీజేపీ, వైసీపీ మధ్య పొత్తు లేదని, అలాంటి పరిస్థితులు కూడా లేవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని, కేంద్రంలో జగన్ పార్టీ కూడా భాగస్వామ్యం అవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. అమరావతిలో రాజధాని రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. గత 60 రోజులుగా ధర్నాలు చేస్తున్న వారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ‘జగన్ రెడ్డి ఎన్డీయేలో కలుస్తున్నారనే అంశం నా దృష్టిలో లేదు. నాకు ఎవరూ ఫోన్ చేసి చెప్పలేదు. జరుగుతున్నది ఓ అబద్ధం, ఓ బూటకం. ఓ ప్రచారం అని అనుకుంటున్నా. ఇది వాస్తవం కాదని అనుకుంటున్నా. అలాంటి పరిస్థితులు లేవని నాకు స్పష్టంగా తెలుసు. ఆ మాట నేను స్పష్టంగా చెప్పగలను. వైసీపీ, బీజేపీకి పొత్తు లేదు. అలాంటి మాటలు నమ్మి కేంద్రంలోని ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాను అపార్థం చేసుకోవద్దు. వైసీపీ నేతలు చేస్తున్న తప్పులకు కేంద్రం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మోదీ, అమిత్ షా తరఫున చెబుతున్నా.. నాకు ఉన్న సమాచారం ప్రకారం వారిద్దరి మధ్య పొత్తులేదు. ఇదంతా కేవలం వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

    రాజధానిలోని యర్రబాలెం గ్రామంలో పవన్ కళ్యాణ్


    మరోవైపు బీజేపీ - వైసీపీ మధ్య పొత్తు ఉండదని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్ కూడా స్పష్టం చేశారు. తమకు జనసేనతోనే పొత్తు ఉందని తేల్చి చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ - జనసేన కలసి పోటీ చేస్తాయని చెప్పారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: