హోమ్ /వార్తలు /రాజకీయం /

వీవీ ప్యాట్ల వ్యవహారంలో... విపక్షాలకు సుప్రీంకోర్టు షాక్

వీవీ ప్యాట్ల వ్యవహారంలో... విపక్షాలకు సుప్రీంకోర్టు షాక్

ప్రతి నియోజకవర్గంలో 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై 22 పార్టీలతో కలిసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు.

    వీవీప్యాట్లు లెక్కించాలన్న విపక్షాల పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు నేతృత్వంలో 21 పార్టీలో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నియోజకవర్గంలో ఐదుశాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని ఇప్పటీకే ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో ఇచ్చిన ఆదేశాల్ని మార్చే ఉద్దేశం లేదని సీజేఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన విపక్షల తరపు న్యాయవాది సింఘ్వి కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు. మా రిప్యూ పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించిందన్నారు. ఏపీలో ఎన్నికల అనంతరం ఈవీఎం ల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన తెలిపారు. ఈసీకి లేఖ రాశారు. ప్రతి నియోజకవర్గంలో 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. దీనిపై 22 పార్టీలతో కలిసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు.

    తీర్పు అనంతరం సుప్రీంకోర్టు వద్ద మాట్లాడుతున్న విపక్ష నేతలు

    దేశవ్యాప్తంగా ఎన్నికలకు 75 రోజులు సమయం తీసుకోగా లేనిది.. స్లిప్పుల లెక్కింపునకు 6 రోజుల కేటాయిస్తే ఇబ్బంది ఏమిటి అని చంద్రబాబు ఈసీని ప్రశ్నించారు. వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడాలు వస్తే 100శాతం లెక్కించిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కానీ విపక్షాలతో కలిసి చంద్రబాబు వేసిన పిటిషన్‌పై సుప్రీంలో ఎదురు దెబ్బ తగిలింది. వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చేసింది.

    First published:

    Tags: Andhra, Chandrababu naidu, EVM, Evm tampering, Supreme Court, Vvpat

    ఉత్తమ కథలు