మళ్లీ నాకే పగ్గాలు.. శివసేనకు సీఎం పదవిపై ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..

2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు శివసేనకు సీఎం పీఠం షేరింగ్‌పై ఎలాంటి హామీ ఇవ్వలేదని ఫడ్నవీస్ తెలిపారు. తానే ఐదేళ్ల పాటు సీఎం కుర్చీలో కూర్చుంటానని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: October 29, 2019, 4:07 PM IST
మళ్లీ నాకే పగ్గాలు.. శివసేనకు సీఎం పదవిపై ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..
ఉధ్దవ్ థాక్రే, దేవేంద్ర ఫడ్నవిస్
  • Share this:
మహారాష్ట్ర రాజకీయం రోజురోజుకు మరింత రంజుగా మారుతోంది. బీజేపీ, శివసేన పొత్తు.. అధికారంపై ఎవరికి వారు పట్టుదలతో ఉండటంతో ఎటూ తేలడం లేదు. 50-50 అని శివసేన.. కుదరదని, తమదే సీఎం పీఠం అని బీజేపీ భీష్మించుకొని కూర్చున్నాయి. దీంతో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు శివసేనకు సీఎం పీఠం షేరింగ్‌పై ఎలాంటి హామీ ఇవ్వలేదని ఫడ్నవీస్ తెలిపారు. తానే ఐదేళ్ల పాటు సీఎం కుర్చీలో కూర్చుంటానని స్పష్టం చేశారు. చెరో రెండున్నరేళ్ల పాటు సీఎం కుర్చీలో కూర్చుందామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనకు మాట ఇచ్చారని ఉద్దవ్ థాక్రే అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఫడ్నవీస్.. శివసేనకు అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని తేల్చి చెప్పారు.

బీజేపీ నేతృత్వంలోని కూటమి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రేపు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకుంటుందని తెలిపారు. ఆ నాయకుడు ఎవరో ప్రధాని మోదీనే స్వయంగా ప్రకటించారని చెబుతూ, తనను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
First published: October 29, 2019, 4:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading