బీజేపీ దూకుడు... టీఆర్ఎస్‌లో ‘నిజామాబాద్’ టెన్షన్

టీఆర్ఎస్‌ను నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాలు తెగ పెడుతున్నట్టు కనిపిస్తోంది.

news18-telugu
Updated: January 25, 2020, 4:30 PM IST
బీజేపీ దూకుడు... టీఆర్ఎస్‌లో ‘నిజామాబాద్’ టెన్షన్
కేసీఆర్, ధర్మపురి అరవింద్ (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు వందకు పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పాలక వర్గాలు ఏర్పాటయ్యేందుకు ఆ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. కొన్ని మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చినా... ఎక్స్ అఫిషియో సభ్యుల సహకారంతో మున్సిపాలిటీలు తమ సొంతమవుతాయనే భావనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. ఇందుకు సంబంధించి ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మిగతా స్థానాల సంగతి ఎలా ఉన్నా... టీఆర్ఎస్‌ను నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాలు తెగ పెడుతున్నట్టు కనిపిస్తోంది.

మొత్తం 60 డివిజన్లు ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్‌లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడానికి టీఆర్ఎస్, బీజేపీ ఎంతగానో శ్రమించాయి. ఎంఐఎం సైతం తమకు పట్టున్న డివిజన్లను నిలుపుకోవాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయో అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఫలితాలు కూడా అదే రకంగా వస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం బీజేపీ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీఆర్ఎస్ 8, ఎంఐఎం 10, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.

nizamabad,terror links in nizamabad,nizamabad news, nizamabada latest news, terrorist in nizamabad, gandhi statue with soot, gundam village,నిజామాబాద్,నిజామాబాద్‌లో ఉగ్రవాదులు,గుండారం,గాంధీ విగ్రహానికి మసి,
ప్రతీకాత్మక చిత్రం


ఎంఐఎం, టీఆర్ఎస్ కంటే బీజేపీ ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉండటంతో నిజామాబాద్ ఫలితం ఏ రకంగా ఉంటుందనే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది. నిజామాబాద్ మేయర్ పీఠం తమకు దక్కుతుందని ధీమాగా ఉన్న టీఆర్ఎస్... అవసరమైతే మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని పంచుకోవాలనే అంశంపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఈ రెండు పార్టీలు కలిసినా మేయర్ పీఠాన్ని బీజేపీకి దక్కకుండా చేయగలగుతాయా అనే అంశంపై కూడా సస్పెన్స్ నెలకొంది. దీనిపై మరికొద్ది గంటల్లోనే స్పష్టత రానుంది. ఏదేమైనా... తెలంగాణవ్యాప్తంగా కారు జోరు కొనసాగినా... నిజామాబాద్‌లో మాత్రం కమలం పార్టీ టీఆర్ఎస్ దూకుడుకు బ్రేకులు వేసినట్టు కనిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: January 25, 2020, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading