ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా కొన్ని ఇష్టాలను మాత్రం ఇట్టే వదులుకోలేం. ఎంతో ఇష్టమైనవి కళ్లముందు కనిపిస్తే, ఆ క్షణాన అధికారం, పదవీ బాధ్యతలు తదితర విషయాలేవీ గుర్తుకురావు కూడా. నిజామాబాద్ ఎంపీ, స్వయానా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారాల కూతురు అయిన కల్వకుంట్ల కవిత కూడా అచ్ఛం ఇలాంటి ప్రవర్తనతోనే జనాల మనసు దోచుకున్నారు.
అసలే వర్షాకాలం. సన్నగా ముసురు పడతోంది. రోడ్డు పక్కనే ఎంతో ఇష్టమైన కంకులు కనిపించాయి. అందులోనూ బొగ్గులపై కాల్చే పచ్చి కంకుల రుచే వేరు. అంతే కారు దిగిన ఎంపీ కవిత, కంకులు కాల్చుతున్న వారి దగ్గరికి వెళ్లి వాటిని దగ్గరుండి కాల్పించుకుని కొనుక్కుని తిన్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా 20 కంకులు నిప్పుల మీద కాలేంత వరకూ అక్కడే ఉండి, వారితో మాట్లాడారు.
నిజామాబాద్ నుండి డిచ్పల్లి వెళ్లే మార్గమధ్యలో రైల్వే ట్రాక్ దాటగానే కంకులమ్మే వారి వద్ద జరిగిందీ సంఘటన. ఎంపీ కవిత రోడ్డు పక్కన కంకులు కొనుక్కోవడం చూసిన వాహనదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. వాహనాలు నిలిపి ఆమె దగ్గరికి వచ్చి అప్యాయంగా పలకరించారు. చాలామంది ఎంపీ కవితతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. 20 కంకులను కొన్న ఎంపీ కవిత, అక్కడున్న పిల్లలకు, అధికారులకు వాటిని పంచి ఇచ్చారు. వేడి వేడి కంకులను తిని, సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యారు. ఎంపీ కవిత తమ దగ్గరికి రావడం, అప్యాయంగా పలకరించి కంకులను ఇష్టంగా కాల్పించుకుని తినడం... అంతా ఓ కలలా అనిపిస్తోందని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు కంకులను విక్రయించే చిరువ్యాపారులు.
రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు తిన్న ఎంపీ కవిత వీడియో చూడండి
Published by:Ramu Chinthakindhi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.