హోమ్ /వార్తలు /politics /

Dharmapuri Arvind: హైదరాబాద్ ఆదాయం అక్కడే ఖర్చు చేస్తున్నారా ? కేటీఆర్‌కు బీజేపీ ఎంపీ కౌంటర్

Dharmapuri Arvind: హైదరాబాద్ ఆదాయం అక్కడే ఖర్చు చేస్తున్నారా ? కేటీఆర్‌కు బీజేపీ ఎంపీ కౌంటర్

ఎంపీ అరవింద్

ఎంపీ అరవింద్

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టే టాక్స్‌లు కంటే ఎక్కువ మొత్తంలో కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుందని అరవింద్ అన్నారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా డ‌బ్బులు కేంద్ర ఇవ్వడం లేదని కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉంద‌ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి 80 శాతం.. మిగతా జిల్లాల్లో 20 శాతం పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని అరవింద్ అన్నారు. ఎక్కడ ఎంత పన్నులు వసూలవుతున్నాయో అక్కడ అంత ఖర్చు చేస్తున్నారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టే టాక్స్‌లు కంటే ఎక్కువ మొత్తంలో కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుందని అరవింద్ అన్నారు. దేశంలోని రక్షణశాఖ, దేశ స‌రిహ‌ద్దులో రక్షణ కోసం కోసం ఎంతో క‌ర్చు చేస్తున్నారని అయ‌న వివ‌రించారు. పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల్లో మీ తూటాలు పేల‌వని... అక్కడ ఒరిజినల్ తూటలు కావాలని ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు.

రైతులు పండించే చివ‌రి గింజ వ‌ర‌కు కొంటామ‌ని ఇప్పటివరకు చెబుతూ వచ్చారని.. ఇప్పుడేందుకు కేంద్ర బియం కోన‌మ‌న్నార‌ని గ‌గ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. రైతుల పండించే ధాన్యాన్ని కొంటోంది కేంద్ర ప్రభుత్వం అని ఇప్పటికైనా ప్రజలకు తెలిసిందని అన్నారు. వ‌డ్లు కొనేందుకు అయ్యే క‌ర్చులు కేంద్రం ఇస్తుంద‌ని వ్యాఖ్యానించారు. కేటీఆర్ రాజీనామా చేసి రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని.. అప్పుడే రాష్ట్రానికి పట్టిన శని పోతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు.

Sleep: నగ్నంగా పడుకోవడం వల్ల ఎన్నో లాభాలు.. చాలా సమస్యలకు పరిష్కారం.. అవేంటో తెలుసుకోండి

Revanth Reddy: కాంగ్రెస్ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్

అంతకుముందు తెలంగాణ నుంచి కేంద్రానికి వెళుతున్న నిధులతో పోల్చితే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు తక్కువే అని మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై చర్చకు తాను సిద్ధమని.. ఒకవేళ కేంద్రం నుంచి తెలంగాణకు ఇక్కడి నుంచి వెళుతున్న దాని కంటే ఎక్కువ నిధులు వస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.

First published:

Tags: Bjp, Dharmapuri Arvind, KTR, Telangana, Trs

ఉత్తమ కథలు