నిజామాబాద్‌లో 100 శాతం పోలింగ్, కవితకు కేసీఆర్ దసరా గిఫ్ట్

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ముగిశాయి. ఈ ఉప ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ నమోదైంది.

news18-telugu
Updated: October 9, 2020, 6:02 PM IST
నిజామాబాద్‌లో 100 శాతం పోలింగ్, కవితకు కేసీఆర్ దసరా గిఫ్ట్
నిజామాబాద్ స్థానిక సంస్థల టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న కల్వకుంట్ల కవిత (File)
  • Share this:
Nizamabad MLC ByPolls: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగిసింది. ఈ ఉప ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈనెల 12న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వస్తాయి. కరోనా వైరస్ కారణంగా ఈసారి ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలో నిర్వహించారు. పూర్తిగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలను నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కోవిడ్ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 24 మందికి కరోనా పాజిటివ్ ఉండడంతో వారంతా పీపీఈ కిట్లు ధరించి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరోనా లేని వారు ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోగా, కరోనా పాజిటివ్ ఉన్న ఓటర్లు మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య వచ్చి ఓటు వేశారు.  ఇక ఎక్స్ అఫీషియో హోదాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

శాసన మండలి ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 824, కార్పొరేటర్లు 226, జడ్పీటీసీలు 49, ఎంపీటీసీలు 537, ఎక్స్ అఫీషియో 12 మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. 824 మంది ఓటర్లలో టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి 494 మంది ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారు 140 మంది, బీజేపీ నుంచి గెలిచిన వారు 84 మందిగా ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు స్వతంత్రులు 66, ఎంఐఎం 28 మంది ఓట్ల ఉన్నారు. ఈ పాటికే స్వతంత్రులు, ఎంఐఎం, ఓటర్లు టీఆర్ఎస్ కు మద్దతు పలికారు. కాంగ్రెస్ - బీజేపీ నుంచి సుమారు 130 మంది ఓటర్లు టీఆర్ఎస్ తీర్దం పుచ్చుకున్నారు. దీంతో ఆ పార్టీ ఓటర్ల‌ బలం 650కి చేరింది. కాంగ్రెస్ - బీజేపీ రెండింటికీ కలిపి 140 లోపు ఓట్లు ఉన్నాయి. దీంతో ఎమ్మెల్సీగా కవిత గెలుపు నల్లేరుపై నడకే.. తమ ఓటర్లను కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు క్యాంప్ లు ఏర్పాటు చేశాయి. పోలింగ్ సమయానికి క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తీసుకువచ్చాయి.

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరపున ముగ్గురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, బీజేపీ అభ్యర్ధిగా లక్ష్మినారాయణ, కాంగ్రెస్ అభ్యర్ధిగా సుభాష్ రెడ్డి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కవిత గెలుపు నల్లేరు మీద నడకే. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఎక్కువ మంది ఉన్నారు. దీంతోపాటు బీజేపీకి చెందిన వారిని కూడా కొందరిని ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ వైపునకు తిప్పుకుంది టీఆర్ఎస్ పార్టీ.

ఎన్నికల కోసం మొత్తం 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 14 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా పెట్టారు. వెబ్ కాస్టింగ్ తో పాటు వీడియో చిత్రీకరణ చేశారు. 50 పోలింగ్ కేంద్రాల పర్యావేక్షణకు 15 రూట్లుగా విభజించి, సెక్టార్ అధికారులు పర్యవేక్షిచారు. 399 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొన్నారు. ఒక్కరికి కూడా కరోనా వైరస్ రాకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో భారీ ఎత్తున శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లను కూడా అందించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 9, 2020, 5:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading