Nizamabad MLC ByElections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం కవిత మెగా ప్లాన్

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అభ్యర్థి కావడంతో అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

news18-telugu
Updated: September 30, 2020, 9:51 PM IST
Nizamabad MLC ByElections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం కవిత మెగా ప్లాన్
నిజామాబాద్ స్థానిక సంస్థల టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న కల్వకుంట్ల కవిత (File)
  • Share this:
Kalvakuntla Kavitha: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అభ్యర్థి కావడంతో అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలకు మ‌రో 9 రోజుల స‌మ‌యం ఉండ‌డంతో జోరుగా వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. గత పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌విత ఓట‌మి పాల‌య్యారు.. ఆలాంటి ప‌లితం పునరావృత్తం కాకుండా సీఎం కేసీఆర్ మెప్పు పొందేందుకు నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లా నేత‌లు వ్యూహ‌లు ర‌చిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీ చెందిన ఆరుగురు కార్పొరేటర్లు, ఒక కాంగ్రెస్ కార్పొరేటర్‌ను తాజాగా ఈ రోజు మ‌రో బీజేపీ కార్పోరేట‌ర్ ను కారెక్కించారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి ఉన్న ఇద్దరు జడ్పీటీసీల్లో ఒకరు ఇప్పటికే కారెక్కారు. మరికొంత మంది ప్రజాప్రతినిధులు కారెక్కెందుకు క్యూలో ఉన్నారు. టీఆర్ఎస్‌కు ఇప్పటికే పూర్తి ఆధిక్యత ఉన్నా వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలో చేర్చుకుంటున్నారు. మొత్తం 824 మంది ప్రజా ప్రతినిధులలో 75 శాతం టీఆర్ఎస్‌కు చెందన వారే ఉన్నారు. అయినా బీజేపీ నేతలే ల‌క్ష్యంగా కారు దూసుకు పోతుంది. అధికార పార్టీ నేతల ఎత్తులతో ఇతర పార్టీలు అంతర్మథనంలో పడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వారి ప్రజా ప్రతినిధులను కాపాడుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో మాజీ ఎంపీ క‌విత గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ను అక్టోబర్‌ 9న నిర్వహించేందుకు స‌ర్వ సిద్దం చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అక్టోబర్‌ 12న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

నిజామాబాద్ స్థానిక సంస్థల బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న యెండల లక్ష్మీనారాయణ (File)


ఉపఎన్నికకు గతంలోనే నోటిఫికేషన్ వచ్చినా కరోనా కారణంగా పోలింగ్ వాయిదా పడింది. భూపతిరెడ్డిపై అనర్హత వేటుతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఇక ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను ముందే ఖరారు చేశాయి పార్టీలు. టీఆర్‌ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్‌రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. మొత్తానికి కరోనా కారణంగా వాయిదా పడ్డ నిజామాబాద్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కో ఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీరే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మె ల్సీని ఎన్నుకోనున్నారు.

నిజామాబాద్ స్థానిక సంస్థల కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సుభాష్ రెడ్డి (File)


మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కేంద్రాలను పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు గతంలో నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 నేపథ్యంలో 50 కేంద్రాలు పెంచాలని జిల్లా అధికారులు నివేదిక పంపారు. ఆ ప్రతిపాదనకు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 30, 2020, 9:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading