కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే...

కవిత(ఫైల్ ఫోటో)

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నిక మళ్లీ వాయిదా పడింది.

  • Share this:
    తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. లాక్ డౌన్ కారణంగా, ఎన్నికలను మరో 45 రోజుల పాటు వాయిదా వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆగస్ట్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు అంచనా. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత గెలుపు లాంఛనమే అని ఆ పార్టీ ధీమాగా ఉంది. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కవితను ఎన్నికల్లో గెలిపించుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు సీఈఓ శశాంక్ గోయల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published: