• Home
 • »
 • News
 • »
 • politics
 • »
 • NIZAMABAD BJP MP DHARMAPURI ARVIND SLAMS TELANGANA CM KCR FOR HIS COMMENTS IN HAALIYA MEETING AK

CM KCR Dharmapuri Arvind: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు

కేసీఆర్, ధర్మపురి అరవింద్ (ఫైల్ ఫోటో)

CM KCR Dharmapuri Arvind: హైదరాబాద్ రాష్ట్రంలోని రజాకార్ల పాలన గొప్పగా ఉందన్నట్టుగా కేసీఆర్ వ్యాఖ్యానించడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు.

 • Share this:
  తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ, ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా హాలియా సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ రజాకార్లకు అమ్ముడుపోయిన కుక్క అని మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అరవింద్.. సీఎం కేసీఆర్ మహిళలను కుక్క అని అనడం దారుణమని అన్నారు. బాధ‌లు చెప్పుకునేందుకు వచ్చిన గిరిజ‌న మ‌హిళ‌ల‌ను సీఎం కేసీఆర్ దూషించడాన్ని తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ ఓవైసీకి అమ్ముడుపోయిన కుక్క అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నారు. సీఎం కేసీఆర్ హాలియా బ‌హిరంగ స‌భ‌లో చెప్పిన‌వ‌న్నీ అబద్ధాలేన‌ని ఆరోపించారు. అస‌లు ఆయనే ఒక అబ‌ద్ధాల పుట్ట అని, అవినీతి గుట్ట అని విమర్శించారు.

  సీఎం కేసీఆర్ ఓ మూర్ఖుడ‌ని, సంస్కార హీనుడ‌ని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. తమ గోడు చెప్పుకునేందుకు వచ్చిన గిరిజన మహిళలను కుక్కలన్న సీఎం జగన్ మ‌ద‌మెక్కిన పెద్ద కుక్క అని విమర్శించారు. హైదరాబాద్ రాష్ట్రంలోని రజాకార్ల పాలన గొప్పగా ఉందన్నట్టుగా కేసీఆర్ వ్యాఖ్యానించడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో మహిళలు సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని ధర్మపురి అరవింద్ అన్నారు.

  నిన్న నల్లగొండ జిల్లా హాలియా సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్... బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు సభలో ఆందోళన చేసేందుకు ప్రయత్నించడంతో.. వారికి సభాముఖంగానే వార్నింగ్ ఇచ్చారు. వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీలాంటి కుక్కలు చాలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని బయటకు తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి పిచ్చిపనులు చేస్తే తొక్కి పడేస్తామని హెచ్చరించారు. సహనానికి కూడా హద్దు ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీ వాల్లు కొత్త బిచ్చగాళ్లలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మము తలుచుకుంటే దుమ్ము దుమ్ము అయిపోతారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పిచ్చిపనులు చేస్తే ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదని కేసీఆర్ అన్నారు. బీజేపీ నాయకత్వం కూడా ఒల్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: