• Home
 • »
 • News
 • »
 • politics
 • »
 • NIZAMABAD BJP MP DHARMAPURI ARVIND SENSATIONAL COMMENTS ON TELANGANA CM K CHANDRASEKHAR RAO BA

వాళ్లు చనిపోతేనే కేసీఆర్ ఫాం హౌస్ బయటకు.. ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు

కేసీఆర్, ధర్మపురి అరవింద్ (ఫైల్ ఫోటో)

భారతీయ జనతా పార్టీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు చనిపోతేనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌస్ దాటి బయటకు వస్తారన్నారు.

 • Share this:
  భారతీయ జనతా పార్టీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు చనిపోతేనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌస్ దాటి బయటకు వస్తారన్నారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను ఫండ్ ఇవ్వకపోవడంతో దళితుల భూములపై పడ్డారని అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ రూరల్ నియోజక వర్గంలో పర్యటించారు. ఇందల్వాయి మండలం మెగ్యనయక్ తండాలో మృతి చెందిన జవాన్ మోతిలాల్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి రూ. 50వేల ఆర్ధిక సాయం అందిస్తానని చెప్పారు. అనంతరం ఎంపీ అరవింద్ మీడియా తో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఫాంహౌజ్ లోకి వెళ్ళిపోతారని, ఎవరైనా ఎమ్మెల్యేలు చనిపోతేనే బయటకు వస్తారని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీ దోచుకోవడానికే మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టారని ఆరోపించారు. ప్రభుత్వం ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ కేటాయించకపోవడం వల్లనే ఎమ్మెల్యేలు దళితుల భూములను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

  2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత మీద గెలిచిన బీజేపీ నేత అర్వింద్ కుమార్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద అప్పుడప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. నల్లగొండ జిల్లా హాలియా సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఇటీవల తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ రజాకార్లకు అమ్ముడుపోయిన కుక్క అని మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సమయంలో అరవింద్.. సీఎం కేసీఆర్ మహిళలను కుక్క అని అనడం దారుణమని అన్నారు. బాధ‌లు చెప్పుకునేందుకు వచ్చిన గిరిజ‌న మ‌హిళ‌ల‌ను సీఎం కేసీఆర్ దూషించడాన్ని తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ ఓవైసీకి అమ్ముడుపోయిన కుక్క అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ హాలియా బ‌హిరంగ స‌భ‌లో చెప్పిన‌వ‌న్నీ అబద్ధాలేన‌ని ఆరోపించారు. అస‌లు ఆయనే ఒక అబ‌ద్ధాల పుట్ట అని, అవినీతి గుట్ట అని విమర్శించారు.

  గతంలో కూడా ఓ సందర్భంలో అరవింద్ మాట్లాడుతూ కేసీఆర్ మంత్రివర్గాన్ని గొర్రెల మందతో పోల్చారు. తెలంగాణలో గడిచిన ఆరేళ్లలో కుటుంబ పాలన తప్ప ఏమీ లేదని విమర్శలు గుప్పించారు. సీ ఓటర్‌ సర్వేలో ప్రథమ స్థానంలో వచ్చిన ఒరిస్సా ముఖ్యమంత్రికి శుభకాంక్షలు తెలిపారు ఎంపీ అరవింద్... ఏపీ సీఎం జగన్‌కు మంచి ర్యాంకు రావడాన్ని ప్రస్తావించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 16వ స్థానంతో పాతాళానికి పడిపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: