స్ట్రాంగ్‌రూంలో ఇబ్బందులున్నాయి...సీఈఓకు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు

రజత్ కుమార్ (ఫైల్)

కౌంటింగ్ ప్రక్రియ జరిగేటప్పుడు ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఆ మిషన్‌ను మరోసారి కౌంట్ చేయాలని చెప్పామన్నారు అరవింద్ కుమార్.

  • Share this:
    సచివాలయంలో సీఈఓ రజత్ కుమార్‌ను కలిశారు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. నిజామాబాద్‌లో 185 మంది పోటీలో నిలవడం అనేది చాలా పెద్ద విషయమన్నారు. ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగిందన్నారు. తమకు కొన్ని అనుమానాలు ఉన్నందునే సీఈఓని కలిశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ జరిగేటప్పుడు ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఆ మిషన్‌ను మరోసారి కౌంట్ చేయాలని చెప్పామన్నారు. కొన్ని మిషన్లు స్ట్రాంగ్‌రూంలకు రావడంలో ఆలస్యమైందన్నారు. స్ట్రాంగ్‌రూంలో కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. మా ప్రతినిధులుకావాలని సెక్యూరిటి పెట్టుకుంటామన్నారు. దీంతో సీఈవో కొంతపరిధిలో పెట్టుకోవచ్చని చెప్పారన్నారు అరవింద్. కేంద్ర బలగాలు ఈవీఎంలకు కాపలాగా ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదన్నారు.

    ఏప్రిల్ 11న తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు కూడా ఎన్నికల బరిలోకి దిగారు. టీఆర్ఎస్ నుంచి కవిత పోటీ చేయగా... బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ పోటీకి దిగారు. మొత్తం 185మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడంతో నిజామాబాద్ ఎన్నికను సవాల్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించింది. అయితే ఎంపీ కవిత మాత్రం ఎన్నికల సంఘం ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

    First published: