HOME »NEWS »POLITICS »nitish kumar likely to take oath as bihar chief minister after diwali on november 16 ba

Bihar Elections: నితీష్ కుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు, సీఎంగా ఎన్నోసారంటే..

Bihar Elections: నితీష్ కుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు, సీఎంగా ఎన్నోసారంటే..
మోదీ, నితీశ్‌కుమార్(ఫైల్ పొటో)

ఈనెల 16న బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది.

  • Share this:
    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కానున్నారు. పొత్తు ధర్మం ప్రకారం నితీష్ కుమార్‌నే సీఎం చేయడానికి బీజేపీ ముందుకొచ్చింది. ఈనెల 16న బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేకి 125 (సాధారణ మెజారిటీ 122) సీట్లు దక్కాయి. ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమికి 110 సీట్లు వచ్చాయి. ఎల్జేపీ 1, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు.  పార్టీల వారీగా చూస్తే.. 75 సీట్లు గెలిచి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74 సీట్లు సాధించింది. జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ  19 స్థానాలకే పరిమితయింది. ఇక CPIMLL 11, MIM 5, HAMS 4, VIP 4,  CPM 3, CPI 2, LJP ఒక స్థానంలో గెలిచాయి. నితీష్ కుమార్ బీహార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఇది ఆరోసారి. గతంలో 2000 (8 రోజులు), 2005, 2010, 2015, 2017లో మొత్తం ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు ఆరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

    35 ఏళ్లగా అసెంబ్లీకి పోటీ చేయని నితీష్


    ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నితీష్ కుమార్ గత 35 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా శాసనసభకు పోటీ చేయలేదు. 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు నితీష్ కుమార్ బీహార్ ఉభయసభల్లోని ఏ సభలో కూడా సభ్యుడు కాదు. అయితే, ఆయన తన బలాన్ని నిరూపించుకోలేకపోవడంతో 8 రోజుల్లోనే (మార్చి 3, 2000 నుంచి మార్చి, 10, 2000) దిగిపోయారు. 2005లో బీజేపీ - జేడీయూ కూటమి విజయం సాధించినప్పుడు నితీష్ కుమార్ రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. అప్పుడు కూడా ఆయన బీహార్ ఉభయ సభల్లో సభ్యుడు కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) నిబంధన ప్రకారం ఉభయ సభల్లో సభ్యుడు కాని వ్యక్తి ముఖ్యమంత్రి లేదా మంత్రి అయితే, ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి. అంటే అసెంబ్లీకి పోటీ చేసి గెలవాలి. లేదా శాసనమండలికి పోటీ చేయడమో, నామినేట్ కావడమో జరగాలి. దీంతో నితీష్ కుమార్ 2006లో శాసనమండలికి ఎన్నికయ్యారు.

    2012లో నితీష్ కుమార్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత మరోసారి బీజేపీ - జేడీయూ కూటమి ఘనవిజయం సాధించడంతో ఆయన మూడోసారి సీఎం అయ్యారు. 2012లో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 35 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి ఒక్కసారి కూడా పోటీ చేయకుండా ఐదుసార్లు సీఎం అయిన నితీష్ కుమార్‌ మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా ఆయనకు లేదని విమర్శిస్తుంటాయి. దీనిపై ఆయన 2012లోనే ఓ సారి వివరణ కూడా ఇచ్చారు. తాను ఇష్ట ప్రకారం ఎమ్మెల్సీ అయ్యాయని, కచ్చితంగా ఎమ్మెల్సీనే అవ్వాలనేది తన అభిమతం కాదన్నారు. నితీష్ రెండోసారి ఎమ్మెల్సీ పదవీకాలం 2018లో ముగిసింది. మూడోసారి కూడా ఎమ్మెల్సీ అయ్యారు. 2024 వరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:November 12, 2020, 14:55 IST

    टॉप स्टोरीज