Home /News /politics /

NITISH KUMAR LIKELY OPPOSITION CANDIDATE FOR PRESIDENT SAYS NCP NAWAB MALIK DAYS AFTER PRASHANT KISHOR MEET MKS

Big News: నితీశ్‌కు రాష్ట్రపతి పదవి! -ఎన్సీపీ సంచలన ప్రకటన -CM KCR మద్దతు ఇస్తారా?

రాష్ట్రపతి కోవింద్ తో బీహార్ సీఎం నితీశ్ (పాత ఫొటో)

రాష్ట్రపతి కోవింద్ తో బీహార్ సీఎం నితీశ్ (పాత ఫొటో)

బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా నితీశ్ ను దింపనున్నాయా? దీని కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెరవెనుక మంత్రాంగం నెరపుతున్నారా? తెలంగాణ సీఎం కేసీఆర్ స్టాండ్ ఎలా ఉండబోతోంది? అంటే..

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా ఏకమవుతోన్న విపక్షాలు.. రాష్ట్రపతి ఎన్నికలను సవాలుగా భావిస్తున్నాయా? బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపనున్నాయా? దీని కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెరవెనుక మంత్రాంగం నెరపుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఇవాళొక సంచలన ప్రస్తావన చేసింది. దీంతో ఏడాది జులైలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది..

శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ పార్టీ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మంగళవారం ముంబైలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అనూహ్య విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై వివిధ పార్టీల నేతలంతా సమష్టిగా నిర్ణయం తీసుకుంటారని మాలిక్ చెప్పారు. అంతేకాదు, బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌ను ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎంపిక చేసే అంశాన్ని పరిశీలించాలంటే ముందుగా బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకోవాలని అన్నారు.

Panna: ఇటుక బట్టీ యజమాని.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!.. కానీ అసలు ట్విస్టుకు షాకవ్వాల్సిందే!


నిజానికి రాష్ట్రపతి పదవికి శరద్ పవార్ పేరు చాలా కాలంగా వినిపిస్తున్నది. కానీ యాక్టివ్ పాలిటిక్స్ కు ఇప్పుడప్పుడే దూరం కావొద్దన్న సూచనలతో పవార్ వెనక్కి తగ్గారు. కాగా, ఇప్పుడు ఎన్సీపీ రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్ పేరును తెరపైకి తేవడం సంచలనంగా మారింది. మొన్న ఆదివారం నాడు నితీశ్ కుమార్.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను ఢిల్లీలో కలుసుకున్న రెండు రోజులకే నితీశ్ కు రాష్ట్రపతి పదవంటూ ఎన్సీపీ ప్రకటన చేయడం వెనుక పెద్ద రాజకీయ తతంగం నడుస్తున్నట్లు వెల్లడైంది. పవార్ పక్కకు జరిగిన క్రమంలోనే నితీశ్ ను విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి రేసులో నిలిపేందుకు ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తున్నారని, ఎన్సీపీ సహా దేశంలోని ఇతర అధికార పార్టీలతో తనకున్న కనెక్షన్లూ వాడుతున్నారనే భావన వ్యక్తమవుతోంది.

Ukraine Crisis: పుతిన్ సంచలనం.. ఉక్రెయిన్‌ రెండు ముక్కలు.. ఇక యుద్ధాన్ని ఎవరూ ఆపలేరు!


బీహార్ లో బీజేపీకి ఎక్కవ సీట్లు వచ్చినా, మిత్రధర్మం ప్రకారం సీఎం సీటును జేడీయూ చీఫ్ నితీశ్ కు కట్టబెట్టారు. కానీ కాల క్రమంలో నితీశ్ కు బీజేపీకి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. బీజేపీకి గట్టి షాకిచ్చేలా ఏదో ఒకటి చేయాలని నితీశ్ సంకల్పించారని, ఆ దిశగానే ప్రశాంత్ కిశోర్ తో భేటీ అయ్యారని గడిచిన 48 గంటల్లో కొన్ని వార్తలొచ్చాయి. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాడనే కారణంతోనే నితీశ్.. జేడీయూ ఉపాధ్యక్ష పదవి నుంచి, పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ ను రెండేళ్ల కిందటే బహిష్కరించిన సంగతి తెలిసిందే.

Gurmeet Ram Rahim: రేపిస్టు డేరా బాబాకు Z-Plus కేటగిరీ భద్రత.. BJP సర్కార్ అనూహ్య ఉత్తర్వులు


మళ్లీ ఇంత కాలం తర్వాత పీకేను ఎందుకు కలిశారని మీడియా ప్రశ్నిస్తే.. ‘మా కలయిక కొత్తేమీ కాదు కదా’అని నితీశ్ బదులిచ్చారు. నితీశ్ గైర్హాజరీలో ప్రశాంత్ కిషోర్ మళ్లీ జేడీయూ పగ్గాలు చేపడతారా? అనేది ఇప్పటికైతే చెప్పలేం. కాగా, ఆదివారం ఢిల్లీలో జరిగిన పరిణామాలకు కొనసాగింపా? అన్నట్లు ఇవాళ ముంబైలో నవాబ్ మాలిక వ్యాఖ్యలు నిలిచాయి. అంతేకాదు,

Ramya Raghupathi: నటుడు నరేశ్ మాజీ భార్య రమ్యపై కేసులు నమోదు.. మరో శిల్పా చౌదరి?


తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవలే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో భేటీ అయి.. జాతీయ స్థాయిలో కలిసి పనిచేద్దామని నిర్ణయించుకున్న క్రమంలో నవాబ్ మాలిక్ ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. పవార్, కేసీఆర్, మమత, ఉద్ధవ్ ఠాక్రే తదితర నేతల సారధ్యంలో 2024 ఎన్నికలోపే బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటవుతుందని మాలిక్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింటుందని, 403 సీట్లున్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి 150 కంటే తక్కువే వస్తాయని అన్నారు. మాలిక్ చెప్పినట్లు రాష్ట్రపతి ఎన్నికల నుంచే విపక్ష పార్టీల ఐక్య కూటమి యాక్టివ్ లోకి వస్తుందా? సీఎం కేసీఆర్ ఎలాంటి మద్దతు అందిస్తారు? వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్ పాత్ర ఎలా ఉండబోతోంది? అనేది వేచిచూడాలి..
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Nawab Malik, Nitish Kumar, Prashant kishor, Sharad Pawar

తదుపరి వార్తలు