మోదీపై ఈ రకంగా కసి తీర్చుకున్న బీహార్ సీఎం నితీష్

కేంద్ర మంత్రివర్గంలో తమకు కనీస ప్రాధాన్యం కల్పించలేదని జేడీయూ రగిలిపోతోంది. దీంతో నితీష్ కుమార్ కేబినెట్‌లో బీజేపీకి స్థానం దక్కలేదు.

news18-telugu
Updated: June 2, 2019, 3:24 PM IST
మోదీపై ఈ రకంగా కసి తీర్చుకున్న బీహార్ సీఎం నితీష్
మోదీ, నితీష్ కుమార్
  • Share this:
బీహార్‌లో సంకీర్ణ ప్రభుత్వం మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. కేంద్ర మంత్రివర్గంలో తమకు సరైన ప్రాతినిధ్యం కల్పించని బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు బీహార్ సీఎం నితీష్ కుమార్. బీహార్‌లో కేబినెట్‌ను విస్తరించారు. కొత్తగా ఎనిమిది మంది జేడీయూ నేతలకు అందులో చోటు కల్పించారు. కనీసం బీజేపీ నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇటీవల నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం సందర్భంగా జేడీయూకి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని నితీష్ అలక వహించారు. బీహార్‌లో జేడీయూ (17 సీట్లు), బీజేపీ (17 సీట్లు) , ఎల్జీపీ (6 సీట్లు) కలసి పోటీ చేశాయి. మొత్తం 39 సీట్లు సాధించాయి. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోయింది. బీజేపీకి 303 సీట్లు వచ్చాయి. ఎన్డీయేతో కలపి 352 సీట్లు వచ్చాయి. దీంతో మిత్రపక్షాల నుంచి ఒక్కొక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చింది. దీనిపై జేడీయూ అలకబూనింది. బీహార్‌లో తమను పెద్దన్నగా చూపిస్తూ... పదవుల విషయంలో తమను కూడా నలుగురిలో ఒకరిగా చూడడాన్ని నితీష్ జీర్ణించుకోలేకపోయారు. ఓ దశలో మోదీ ప్రమాణస్వీకారానికి వెళ్లకూడదనే చర్చ కూడా వచ్చింది. అయితే, తాము ఎన్డీయేలోనే ఉన్నామని నితీష్ స్పష్టం చేశారు. ఇప్పుడు తన మంత్రివర్గంలో బీజేపీకి అవకాశం కల్పించకుండా కసి తీర్చుకున్నారు.
First published: June 2, 2019, 3:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading