ఏపీకి ప్రత్యేక రాయితీలు ఇవ్వలేం.. జగన్‌ ప్రభుత్వానికి కేంద్రం షాక్

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని కేంద్రం పలుమార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు పారిశ్రామికాభివృద్దికి రాయితీలు కూడా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

news18-telugu
Updated: July 25, 2019, 5:06 PM IST
ఏపీకి ప్రత్యేక రాయితీలు ఇవ్వలేం.. జగన్‌ ప్రభుత్వానికి కేంద్రం షాక్
Video : నేను సీఎం రేసులో లేను : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల కోసం ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం జీఎస్టీ అమల్లోకి వచ్చిందని, ఈ క్రమంలో ఏ ఒక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఒక విధానం తీసుకొస్తే అది దేశం మొత్తం ఒకేలా ఉంటుందని, ఒక రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఉండదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. లోక్‌సభలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. ఏపీలో గత ఐదేళ్లుగా ఎలాంటి పారిశ్రామికాభివృద్ధి లేదని, ఫలితంగా పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగిపోయిందని అవినాష్ రెడ్డి అన్నారు. అందు వల్ల ఏపీలో నిరుద్యోగ సమస్యను తగ్గించేందు కోసం పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించేందుకు కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు గతంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని, అది ఇంకా అమలు కాలేదని గుర్తు చేశారు. అలాగే క్లస్టర్ డెబలప్‌మెంట్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 23 ప్రతిపాదనలు పంపిందని, వాటిపై కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించారు.

అవినాష్ రెడ్డి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. ఏపీకి ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వడం కుదరదన్నారు. ‘దేశం మొత్తం ఒకే విధానం ఉంటుంది. ఒక రాష్ట్రం కోసం ప్రత్యేకంగా జీఎస్టీ వెసులుబాటు కుదరదు. ప్రత్యేక పథకాలు ఇవ్వడం ఇప్పుడు సాధ్యం కాదు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజ్ పార్క్ బావుంది. బాగా పనిచేస్తుంది. అలాంటి వాటిని ఇతర రాష్ట్రాల్లో కూడా నెలకొల్పేందుకు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశాం.’ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వీలైనన్ని ప్రతిపాదనలు పంపాలని, వాటిని కేంద్రం సానుకూల దృష్టిలో పరిశీలిస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారు. అయితే, ప్రత్యేక హోదా గురించి గడ్కరీ ప్రస్తావించలేదు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని కేంద్రం పలుమార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు పారిశ్రామికాభివృద్దికి రాయితీలు కూడా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 25, 2019, 4:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading