యూపీలో యోగి కోటను బద్దలు కొట్టిన నేత.. బీజేపీలో చేరిక

ఈ ఎన్నికల్లో నిషాద్ పార్టీ మహా కూటమికి మద్దతిస్తుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అది జరిగిన 48 గంటల్లోనే ప్రవీణ్ నిషాద్ పార్టీని వీడారు.

news18-telugu
Updated: April 4, 2019, 4:51 PM IST
యూపీలో యోగి కోటను బద్దలు కొట్టిన నేత.. బీజేపీలో చేరిక
జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన ప్రవీణ్ నిషాద్ (ANI)
  • Share this:
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన నిషాద్ పార్టీ నేత, ప్రవీణ్ నిషాద్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో ఆయన కమలం కండువా కప్పుకొన్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్, మరో ఎంపీ కేశవ్ ప్రసాద్ మౌర్య ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో గోరఖ్ పూర్, ఫూల్‌పూర్ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో ఎస్పీ, బీఎస్పీ ఒక్కటయ్యాయి. గోరఖ్‌పూర్‌లో బీజేపీ మీద నిషాద్ పార్టీ నుంచి ప్రవీణ్ నిషాద్ అనే యువకుడిని బరిలో దింపాయి. సమాజ్ వాదీ టికెట్ మీద ప్రవీణ్ నిషాద్ పోటీ చేసి విజయం సాధించారు. రెండు దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహించిన గోరఖ్ పూర్‌ స్థానంలో బీజేపికి షాక్ ఇచ్చారు. గత వారం ఎస్పీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు బీజేపీలో చేరారు. మళ్లీ గోరఖ్‌పూర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి నిషాద్‌ను బీజేపీ బరిలోకి దింపే అవకాశం ఉంది.

ఈ ఎన్నికల్లో నిషాద్ పార్టీ మహా కూటమికి మద్దతిస్తుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అది జరిగిన 48 గంటల్లోనే ప్రవీణ్ నిషాద్ పార్టీని వీడారు. ప్రవీణ్ నిషాద్ తండ్రి సంజయ్... నిషాద్ పార్టీ అధినేత. గోరఖ్ పూర్‌ లోక్‌సభ నియోజవకవర్గంలో నిషాద్ సామాజికవర్గానికి చెందిన ఓబీసీలు సుమారు 3.5లక్షల మంది ఉంటారని అంచనా. ఆ ఓట్లన్నీ గంపగుత్తగా పడితే బీజేపీకి గెలుపు నల్లేరు మీద నడకేనని భావిస్తున్నారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ కూడా ఎస్పీ తరఫున నిషాద్ సామాజికవర్గానికే చెందిన ఓ నేతను అభ్యర్థిగా ప్రకటించారు.
First published: April 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading