Home /News /politics /

శశి ఎలా ఉన్నారు? ఆస్పత్రిలో కాంగ్రెస్‌ ఎంపీకి కేంద్రమంత్రి పరామర్శ

శశి ఎలా ఉన్నారు? ఆస్పత్రిలో కాంగ్రెస్‌ ఎంపీకి కేంద్రమంత్రి పరామర్శ

శశిథరూర్‌ను పరామర్శిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

శశిథరూర్‌ను పరామర్శిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

ఆమె అడిగిన ప్రశ్నలకు సైగలతో సమాధానమిచ్చామన్నారు. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని ట్వీట్ చేశారు శశి.

    ఇటీవల తులాభారం వేస్తూ కిందపడి గాయాలపాలైన శశిథరూర్‌ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు. ఆస్పత్రిలో ఉన్న ఆయనను కలిసి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో కేంద్రమంత్రి పరామర్శపై శశిథరూర్ ట్వీట్ చేశారు. కేరళలో ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్నా కూడా తనను కలిసేందుకు నిర్మలా సీతారామన్ ఆస్పత్రికి వచ్చారన్నారు. ఆమె అడిగిన ప్రశ్నలకు సైగలతో సమాధానమిచ్చామన్నారు. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని ట్వీట్ చేశారు శశి.

    కేరళ రాజధాని తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటికే వరుసగా రెండు సార్లు గెలిచిన శశిథరూర్‌.. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి కుమ్మనం రాజశేఖరన్‌, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి దివకరణ్‌తో ఆయన పోటీపడనున్నారు. కేరళలో ఏప్రిల్‌ 23న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నించారు. అంతకుముందు సోమవారం కేరళ నూతన సంవత్సరాది విషు పండగను పురస్కరించుకుని తంపనూర్‌ ప్రాంతంలోని గాంధారి అమ్మన్‌ కోవిళ్‌ ఆలయాన్ని శశిథరూర్‌ సోమవారం సందర్శించారు.

    ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో తులాభారం నిర్వహించేందుకు ప్రయత్నించారు. తులాభారం కోసం త్రాసుపై కూర్చున్నారు. ఇంతలో శశిథరూర్‌ కూర్చున్న త్రాసు ఒక్కసారిగా తెగి కిందపడింది. ఈ ఘటనలో ఆయన కాలికి, తలకు గాయమైంది. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. థరూర్‌ తలకు ఆరు కుట్లు పడ్డాయని డాక్టర్లుచెబుతున్నారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.తులభారం అనంతరం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలనుకున్నారు. తులాభారంలో గాయాలపాలవ్వడంతోప్రచారాన్ని కాస్త వాయిదా వేసుకున్నారు శశిథరూర్.

     
    First published:

    Tags: Bjp, Congress, Kerala, Lok Sabha Election 2019, Nirmala sitharaman, Shashi tharoor

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు