హోమ్ /వార్తలు /రాజకీయం /

నిర్భయ కేసు: ఇద్దరు దోషుల క్యూరేటివ్ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

నిర్భయ కేసు: ఇద్దరు దోషుల క్యూరేటివ్ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

అయితే ఇలాంటి పిటిషన్‌పై న్యాయస్థానం కేవలం కేవలం ఐదు నిమిషాలు పాటు మాత్రమే విచారణ చేపట్టనుంది.

  నిర్భయ కేసులో ఇద్దరు దోషుల క్యూరేటివ్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 2012లో నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, చంపిన నేరస్థులు ముకేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31)లను జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇందులో వినయ్ శర్మ, ముకేష్ క్యూరేటివ్ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం గంట 1.45 నిమిషాలకు సుప్రీంకోర్టు విచారించనుంది. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వీరి పిటిషన్‌ను పరిశీలించనుంది. ఎన్వీ రమణ, అరుణ్ మిశ్ర, ఆర్ఎఫ్ నారిమన్, ఆర్ భానుమతి, అశోక్ భూషన్ ఈ బెంచ్‌లో ఉన్నారు.

  క్యూరేటివ్ పిటిషన్ అంటే ?

  నిర్భయ నిందితుల క్యూరేటివ్ పిటిషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటి అన్న ప్రశ్న చాలామందిలో కలిగింది. ఏదైనా కేసులో దోషులు చిట్టచివరి న్యాయపరమైన అవకాశం కోసం దాఖలు చేసే పిటిషన్‌నే క్యురేటివ్ పిటిషన్ అంటారు. 2002లో రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా కేసులో క్యురేటివ్ పిటిషన్‌కు మొదటిసారి సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ముంబై పేలుళ్ల కేసులో కూడా దోషిగా తేలిన యాకుబ్ మెమన్ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే. దీంతో అప్పట్లో యాకుబ్ తరపు న్యాయవాది 5 నిమిషాల వాదనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు

  ఇదిలా ఉంటే... ఇప్పటికే నిర్భయ కేసులో అక్షయ్ కుమార్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు మరో ఇద్దరు దోషుల విషయంలో కూడా ఇదే జరుగుతందని దేశ ప్రజలు భావిస్తున్నారు. వీరిని ఈనెల 22న ఉరి తీసేందుకు తీహార్ జైల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉరితాళ్లను కూడా సిద్దం చేశారు. నలుగురిని ఒకేసారి ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: National News, Nirbhaya, Supreme Court

  ఉత్తమ కథలు