హోమ్ /వార్తలు /రాజకీయం /

శబరిమల రివ్యూ పిటిషన్లపై నేటి నుంచి సుప్రీంలో విచారణ

శబరిమల రివ్యూ పిటిషన్లపై నేటి నుంచి సుప్రీంలో విచారణ

శబరిమలలో అయ్యప్ప భక్తులు

శబరిమలలో అయ్యప్ప భక్తులు

అప్పట్లో ఈ కేసును 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించింది. అందులో ముగ్గురు న్యాయమూర్తులు వివిధ అంశాలకు సంబంధించి ఈ కేసుపై అసమ్మతి తెలిపారు.

  ప్రముఖ శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలయ్యాయి. రుతుక్రమం వయస్సులో ఉన్న మహిళకు ఆలయ ప్రవేశం కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ 60కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి.వీటిపై ఇవాల్టీ నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అప్పట్లో ఈ కేసును 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించింది. అందులో ముగ్గురు న్యాయమూర్తులు వివిధ అంశాలకు సంబంధించి ఈ కేసుపై అసమ్మతి తెలిపారు. ఈ నెల 13న జరగబోయే రివ్యూ పిటిషన్లపై విచారణలో ఆ ముగ్గురు న్యాయమూర్తులు పాల్గొన‌డం లేదు.

  ఈ క్రమంలో రివ్యూ పిటిషన్లపై విచారణ జరిపే ధర్మాసనంలో ఉండబోయే న్యాయమూర్తుల పేర్లను సుప్రీం కోర్టు ఇదివరకే ప్రకటించింది. ఇందులో సుప్రీం కోర్టు సీజే బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనంలో న్యాయమూర్తులు ఆర్‌.భానుమతి, అశోక్‌ భూషణ్‌, ఎల్‌. నాగేశ్వర రావు, మోహన్‌ ఎం. శంతన గౌడర్‌, ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌, ఆర్‌. సుభాష్‌ రెడ్డి, బి.ఆర్‌. గవారు, సూర్యకాంత్‌ సభ్యులుగా ఉన్నారు.ఇందు మల్హోత్రా, ఎ.ఎం. ఖన్విల్కర్‌, రోహిన్టన్‌ నారీమన్‌, డి.వై. చంద్రచూడ్‌ తదితరులు ఈ ధర్మాసనంలో లేరు.

  10-50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవడాన్ని కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పుపై జస్టిస్‌ ఇందు మల్హోత్ర మాత్రమే అసమ్మతి వ్యక్తం చేశారు.ఈ అంశాన్ని అతి పెద్ద రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపాలన్న నవంబరు 14, 2019 నాటి మెజార్టీ నిర్ణయంపై అసమ్మతి తెలిపిన వారిలో జస్టిస్‌ నారిమన్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌లు ఉన్నారు. చట్ట నిబంధనలు పాటిస్తూ మహిళా సందర్శకులకు రక్షణ కల్పించాలని జస్టిస్‌ నారిమన్‌ కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Kerala, National, Sabarimala, Sabarimala Temple, Supreme Court

  ఉత్తమ కథలు