నేడు బాధ్యతలు చేపట్టనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్... ముహూర్తం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.

news18-telugu
Updated: August 3, 2020, 3:51 AM IST
నేడు బాధ్యతలు చేపట్టనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్... ముహూర్తం
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11.15 గంటలకు ఆయన బాధ్యతలు చేపడతారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను పునర్నియమిస్తూ ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఆయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. ఈ క్రమంలో బాధ్యతలు చేపట్టనున్నారు.

హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎన్నికల కమిషనర్‌గా రమేశ్ కుమార్ నియామకానికి సంబంధించి గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ ఆర్డినెన్సును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌నే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 3, 2020, 3:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading