Nimmagadda Ramesh: నిమ్మగడ్డకు టీడీపీలో ఆ పదవి ఖాయమైంది: విజయసాయిరెడ్డి

‘ఎన్టీఆర్ ను చంద్రబాబు దింపేసి పార్టీని లాక్కున్నట్టే.. నాలుగు నెలల తర్వాత టీడీపీ తెరవెనుక పెద్దలంతా బాబును దింపి నిమ్మగడ్డ రమేష్ ను కూర్చోబెట్టడం ఖాయం అనిపిస్తోంది.’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

news18-telugu
Updated: November 20, 2020, 5:18 PM IST
Nimmagadda Ramesh: నిమ్మగడ్డకు టీడీపీలో ఆ పదవి ఖాయమైంది: విజయసాయిరెడ్డి
నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఖాయమైనట్టుగా ఉందని వైసీపీ రాజ్యసభ ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నిమ్మగడ్డ రమేష్ రిటైర్మెంట్ తర్వాత ఆయన్ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ఖాయం అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అలానే, ఎన్టీఆర్ ను చంద్రబాబు దింపేసి పార్టీని లాక్కున్నట్టే.. నాలుగు నెలల తర్వాత టీడీపీ తెరవెనుక పెద్దలంతా బాబును దింపి నిమ్మగడ్డ రమేష్ ను కూర్చోబెట్టడం ఖాయం అనిపిస్తోంది.’ అని విజయసాయిరెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ పదవిలో కూర్చుని చంద్రబాబు తొత్తుగా, ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని అన్నారు. టీడీపీకి అధికార ప్రతినిధిగా, చంద్రబాబు ఎన్నికలు జరపమంటే జరుపుతాను, ఆపమంటే ఆపుతాను అన్నట్టుగా పనిచేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులతో స్టార్ హోటళ్ళలో రహస్య మీటింగ్ లు నిర్వహించి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని నిమ్మ గడ్డపై మండిపడ్డారు. టీడీపీ కేడర్లు చంద్రబాబుని నమ్మడం మానేసి.. నిమ్మగడ్డ రమేష్ ను నమ్ముకున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెలుగుదేశం, సీపీఐ లాంటి పార్టీలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే.. చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు.

‘కరోనా వైరస్ వ్యాప్తికి ముందు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తై, పోలింగ్ ప్రారంభమయ్యే దశలో చంద్రబాబు డైరెక్షన్ లో ఆరోజు ఎన్నికలను నిమ్మగడ్డ అడ్డుకున్నారు. ఈరోజు ఢిల్లీ, ఇతర నగరాల్లో వందల మంది చనిపోతుంటే ఎన్నికలు జరుపుతానని మంకుపట్టు పడుతున్నారు. ప్రజల శ్రేయస్సు నిమ్మగడ్డకు పట్టదు. రాజకీయాలే ఆయనకు ముఖ్యం. నిమ్మగడ్డ ఇప్పటికైనా తన పంథా మార్చుకోవాలి.’ అని విజయసాయిరెడ్డి సూచించారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు.. ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇళ్ళను పేదలకు ఇస్తుంటే.. టీడీపీకి ఆ కాస్త మిగిలిన 20 సీట్ల గుండె ధైర్యం కూడా పోయినట్టుందని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వవొద్దని అడ్డుపడిన ఏకైక పార్టీగా టీడీపీ మిగిలిపోతుందన్నారు. దళిత వర్గాలకు, బీసీలకు, పేదలకు టీడీపీ చేసిన ద్రోహం మీద ఎక్కడికక్కడ పేదలు నిలదీయాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ‘గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇలానే పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటే భవిష్యత్తులో 2 సీట్లకు ఆ పార్టీ పరిమితం అవుతుంది. దేశ చరిత్రలో పేదలకు ఇళ్ళు ఇస్తామంటే అడ్డుకునే అభివృద్ధి నిరోధకుడు, పేదల వ్యతిరేకి చంద్రబాబే. ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు అనర్హుడు.’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

విశాఖపట్నం ఎయిర్ పోర్టు నేవీ ఎయిర్ పోర్టు అని, అటు రాష్ట్ర ప్రభుత్వానిదిగానీ, ఇటు కేంద్రానిదిగానీ కాదన్నారు. నేవీ నిబంధనలు కఠినతరంగా ఉండటం వల్ల ల్యాండింగ్, టేకాఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రానికి గానీ, కేంద్రానికి గానీ ఒక ఎయిర్ పోర్టు ఉండాలన్న మంచి ఉద్దేశంతో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా భోగాపురం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా కమర్షియల్ ఆపరేషన్స్ ను తరలించడం అన్నది సంప్రదాయం అని విజయసాయిరెడ్డి చెప్పారు. హైదరాబాద్ లో కూడా పాత బేగంపేట ఎయిర్ పోర్టును శంషాబాద్ కు తరలించారని వైసీపీ ఎంపీ గుర్తు చేశారు. ‘చంద్రబాబుకు, యనమలకు వయసు పై బడటం వల్ల మతి భ్రమించింది. ఒక సబ్జెక్టు మీద మాట్లాడేటప్పుడు కనీస అవగాహన చేసుకోండి. తెలిసీ తెలియకుండా ఏదిపడితే అది మాట్లాడవద్దు. రాజకీయ నేతలుగా ఉంటూ.. మీ పరువును మీరే తీసుకోవద్దు.’ అని విజయసాయిరెడ్డి సూచించారు.

భోగాపురం ఎయిర్ పోర్టును చంద్రబాబు అసమర్థత వల్ల, కట్టలేక వదిలేస్తే, ఆ ప్రాజెక్టును ఈరోజు ముఖ్యమంత్రి జగన్ నిజం చేస్తున్నారన్నారు. ఏమాత్రం అభివృద్ధి చేయకుండా, విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు, ఇతర ప్రతిపక్షాలకు లేదన్నారు.

సీఎం జగన్ ఆదేశాల ప్రకారం.. విశాఖపట్నాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు, అభివృద్ధిపరంగా విశాఖను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా పరిశ్రమలకు సంబంధించిన సమస్యలు, కొత్తగా పరిశ్రమలను ఎలా తీసుకురావాలి, పారిశ్రామిక రంగం, సేవా రంగం ఎలా అభివృద్ధి చేయాలి.. అన్న అంశాలపై నవంబరు 21న ఇంటరాక్టివ్ సెషన్ విశాఖలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 20, 2020, 5:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading