హైకోర్టులో రమేష్ కుమార్ కౌంటర్ అఫిడవిట్...

ఆర్డినెన్స్ ద్వారా తనను తొలగించడానికి కానీ, తన పదవీ కాలాన్ని తగ్గించడానికి కానీ రాష్ట్ర ప్రబుత్వానికి అధికారం లేదని చెప్పారు.

news18-telugu
Updated: April 19, 2020, 10:38 PM IST
హైకోర్టులో రమేష్ కుమార్ కౌంటర్ అఫిడవిట్...
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో రీజాయిండర్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌కు ఆయన ఈరోజు రీజాయిండర్ దాఖలు చేశారు. తనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అని స్పష్టం చేశారు. తనను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా తొలగించేందుకే నిబంధనలకు విరుద్ధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని తెలిపారు. ఎస్ఈసీగా నియమితులైన వ్యక్తి 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు (ఏది ముందు అయితే అది) వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. ఎస్ఈసీని తొలగించాలంటే పార్లమెంట్ ఆమోదం పొంది హైకోర్టు జడ్జిని తొలగించే విధానంలోనే తప్పించాలని స్పష్టం చేశారు. ఎస్ఈసీని తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదని చెప్పారు. తాను ఎస్ఈసీగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవంటూ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ నిర్దిష్టంగా లేదని, అసంబద్ధంగా ఉందని రమేష్ కుమార్ ఆరోపించారు. కాబట్టి దాన్ని కొట్టివేయాలని కోర్టును కోరారు. హైకోర్టు 16వ తేదీలోపే కౌంటర్ వేయాలని ఆదేశిస్తే.. రెండు రోజులు ఆలస్యం చేసిన విషయాన్ని ఆయన తన అఫిడవిట్‌లో ప్రస్తావించారు.

2011- 12లో ఎన్నికల సంస్కరణలపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సిఫార్సులకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలకు విరుద్ధంగా తనను తొలగించాలని హైకోర్టకు విన్నవించారు. తనను పదవి నుంచి తొలగించడం రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు మిగిలిన అంశాలను పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అభీష్టం, ఉద్దేశాలకు వ్యతిరేకంగా నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహిస్తున్నందుకే తనను తొలగించారని ఆరోపించారు. రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవంటూ ఏకంగా ముఖ్యమంత్రి జగన్ చెప్పడంలోనే తనను తొలగించాలనే ఉద్దేశం స్పష్టం అవుతుందన్నారు. అలాగే, తనను తప్పించి కేంద్ర ఎన్నికల సంఘం లేదా అధికారులతో కూడిన కమిటీతో ఎన్నికలు జరపాలిన కేంద్రానికి సీఎస్ లేఖ రాయడాన్ని రమేష్ కుమార్ తన రీ జాయిండర్‌లో ప్రస్తావించారు.

ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని తగ్గించే అధికారం రాష్ట్రానికి ఉన్నా, అది ప్రస్తుతం పదవిలో ఉన్న వారికి వర్తించదని రమేష్ కుమార్ గుర్తు చేశారు. ఆర్డినెన్స్ ప్రకారం తనను తొలగించడానికి కానీ, తన పదవీ కాలాన్ని తగ్గించడానికి కానీ రాష్ట్ర ప్రబుత్వానికి అధికారం లేదని చెప్పారు.
First published: April 19, 2020, 8:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading