Home /News /politics /

NIMMAGADDA RAMESH KUMAR EFFECT YS JAGANMOHAN REDDY YSRCP PLANS TO CHECK CHANDRABABU NAIDU IN CONSTITUIONAL WAY BA

YS Jagan: నిమ్మగడ్డ ఎఫెక్ట్.. రాజ్యాంగం ప్రకారమే చంద్రబాబుకు చెక్ పెట్టనున్న వైసీపీ?

చంద్రబాబునాయుడు  (File)

చంద్రబాబునాయుడు (File)

ప్రస్తుతం నిమ్మగడ్డ చూపిస్తున్న దూడుకుడు చెక్ పెట్టడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయపరంగా, అధికారికంగా నిమ్మగడ్డను ఢీకొట్టడానికి ప్రయత్నిస్తున్నా.. అదే సమయంలో ఆ ప్రభావం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మీద పడనుంది.

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద ఉన్న అధికారులు, నేతలను టార్గెట్ చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారింది. సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను తొలగించాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. దీనిపై పెద్ద దుమారం రేగుతోంది. ప్రవీణ్ ప్రకాష్ ఎన్నికలను ప్రభావితం చేస్తారని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ, ప్రభుత్వ సేవకుడిగా ఉంటూ, ఆయన వైసీపీ పార్టీ ఆఫీసులో ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. దీనిపై అటార్నీ జనరల్ సలహా తీసుకోవాలని సూచించారు. అలాగే, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటివారు ఎన్నికల సంఘం మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

    ప్రస్తుతం నిమ్మగడ్డ చూపిస్తున్న దూడుకుడు చెక్ పెట్టడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయపరంగా, అధికారికంగా నిమ్మగడ్డను ఢీకొట్టడానికి ప్రయత్నిస్తున్నా.. అదే సమయంలో ఆ ప్రభావం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మీద పడనుంది. ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉన్నంతకాలం ఆయనకు అధికారాలు ఉంటాయి కాబట్టి, ఆయన ఉన్నంత కాలం చూసీ చూడనట్టు వెళ్లాలని అధికారులకు పరోక్షంగా ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చినట్టు తెలిసింది. దీనికి చంద్రబాబు వద్ద రివేంజ్ తీర్చుకోవడానికి వైసీపీ వ్యూహం రచించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    చంద్రబాబు ప్రతిపక్ష హోదా రద్దు?
    చంద్రబాబుకు ప్రతిపక్ష హోదాను రద్దు చేయించేందుకు వైసీపీ వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన వెంటనే దీన్ని అమలు చేయనున్నట్టు సమాచారం. ఈ లోపే టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా వైసీపీలోకి లాగడానికి ప్రణాళిక రచించినట్టు తెలిసింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో నలుగురు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. అంటే, 19 మంది మిగిలారు. ప్రతిపక్ష హోదా ఉండాలంటే కనీసం 17 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంటే, మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకొంటే ఇక చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉండదు. ప్రధాన ప్రతిపక్ష హోదాను రద్దు చేస్తున్నట్టు స్పీకర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, దీనిలో కొన్ని సాంకేతిక అంశాలు ఉన్నా.. ప్రభుత్వం తమ చేతిలోనే ఉంది కాబట్టి, అన్నీ రాజ్యాంగబద్ధంగానే జరిపించాలని వైసీపీ భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap local body elections, Chandrababu naidu, Gram Panchayat Elections, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు