Home /News /politics /

NIMMAGADDA RAMESH KUAMR ISSUES ORDER TO DISTRICT COLLECTOR AND ELECTION OFFICIALS TO RECORD NOMINATION WITH DRAW PROCESS FULL DETAILS HERE PRN

AP Municipal Elections: నామినేషన్ల విత్ డ్రా పై నిమ్మగడ్డ కీలక ఆదేశాలు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ (File)

నిమ్మగడ్డ రమేష్ కుమార్ (File)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మున్సిపల్ ఎన్నికల (AP Municipal Elections) ప్రక్రియ రచ్చ రేపుతోంది. రాజకీయ పార్టీల మధ్య వైరంతో వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ నేటితో ముగుస్తండటంతో ఉత్కంఠ నెలకొంది.

    ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ రచ్చ రేపుతోంది. రాజకీయ పార్టీల మధ్య వైరంతో వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ నేటితో ముగుస్తండటంతో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా తమ అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కీలక ప్రకటన చేశారు. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియను వీడియో తీయాలని ఆదేశించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు బలవంతపు ఉపసంహరణలను ఆమోదించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. విత్ డ్రా చేసుకునే అభ్యర్థి స్వయంగా వస్తే తప్ప.. ఇతరుల జోక్యానాని పట్టించుకోవద్దని స్పష్టం చేశారు.

    ఈ అదేశాలను జిల్లా కలెక్టర్లతో పాటు ఎన్నికల అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బంది తప్పకుండా పాటించాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్థుల ప్రమేయం లేకుండానే ఇతర వ్యక్తులే బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి.

    AP Municipal Elections, Andhra Pradesh News, AP News, Andhra Pradesh municipal Elections, Municipal Elections, AP SEC Nimmagadda Ramesh Kumar, Nimmagadda Ramesh Kumar, AndhraPradesh, AP local Body Elections,Telugu news, State Election commission, AP SEC, SEC, ఏపీ మున్సిపల్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఏపీ న్యూస్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆంధ్ర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, తెలుగు న్యూస్, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఏపీ ఎస్ఈసీ, ఎస్ఈసీ
    నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలన ఆదేశాలు


    ఫిర్యాదులను పరిశీలించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. కలెక్టర్లు, ఇతర అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విత్ డ్రా ప్రక్రియను వీడియో తీయడంతో పాటు ఆ ఫుటేజ్ ను ఎన్నికల కమిషనర్ రికార్డ్స్ లో భద్రపరచాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలు ప్రారంభైనప్పటి నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బెదిరింపుల వల్ల నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న ఆరోపణలపై స్పందించిన ఆయన.. రీ నామినేషన్లకు అవకాశం కల్పించారు. ఈ ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. మరోవైపు ఈ నెల 1 నుంచి 31 వరకు సెలవుపై వెళ్లిన కడప జిల్లా ప్రొద్దటూరు మున్సిపల్ కమిషనర్ కు లీవ్ మంజూరు చేస్తూ ఆయన స్థానంలో మరో అధికారిని నియమించినట్లు నిమ్మగడ్డ తెలిపారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Ap new, AP News, Municipal Elections, Nimmagadda Ramesh Kumar, Telugu news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు