షాద్‌నగర్ ఎన్‌కౌంటర్... నిందితుల మృతదేహాల్ని పరిశీలించిన NHRC

ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు గుడిగుంట్లకు వెళ్లి చెన్న కేశవులు కుటుంబం స్టేట్ మెంట్ ను రికార్డు చేయనున్నారు.

news18-telugu
Updated: December 7, 2019, 4:17 PM IST
షాద్‌నగర్ ఎన్‌కౌంటర్... నిందితుల మృతదేహాల్ని పరిశీలించిన NHRC
షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ ఘటనా స్థలం
  • Share this:
సంచలనం సృస్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై NHRC స్పందించిన విషయం తెలిసిందే.  ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల ఎన్ హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. దీంతో నిందితుల మృతదేహాల్నిపరిశీలించేందుకు ఈ టీమ్ మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహంచిన వైద్యుల పర్యవేక్షణలో ఎన్ కౌంటర్ మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం రిపోర్టును కూడా పరిశీలించారు. వీరి పర్యటనలో భాగంగా మృతుల కుటుంబ సభ్యులతో ఎన్ హెచ్ఆర్సీ బృందం మాట్లాడనుంది. వీరి పర్యటన నిమిత్తం పోలీసులు పాలమూరులో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

మరోవైపు ఆస్పత్రి వద్దకు నిందితులు ఆరిఫ్, నవీన్, శివ కుటుంబసభ్యులు చేరుకున్నారు. దీంతో వారికి నిందితుల మృతదేహాల్ని చూపించారు. అయితే మరో నిందితుడైన చెన్నకేశవులు కుటుంబం మాత్రం మార్చురీ వద్దకు రాలేదు. ఇప్పటికే చెన్నకేశవులు కుటుంబ సభ్యలు ఈ ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ ధర్నా, రాస్తారోకో చేస్తన్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు గుడిగుంట్లకు వెళ్లి చెన్న కేశవులు కుటుంబం స్టేట్ మెంట్ ను రికార్డు చేయనున్నారు.

First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>