పట్టు వదలని రేవంత్ రెడ్డి... కేటీఆర్‌కు కొత్త చిక్కులు

జీవో 111ను ఉల్లంఘిస్తూ కేటీఆర్ జన్వాడలో ఫాంహౌస్ నిర్మించారంటూ రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు.

news18-telugu
Updated: June 6, 2020, 2:40 PM IST
పట్టు వదలని రేవంత్ రెడ్డి... కేటీఆర్‌కు కొత్త చిక్కులు
కేటీఆర్, రేవంత్ రెడ్డి
  • Share this:
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జనవాడ ఫాం హౌస్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు ఇచ్చింది. సదరన్ జోన్‌కు చెందిన సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అ కమిటీలో కేంద్ర సభ్యులతో పాటు రాష్ట్రానికి చెందిన కొందరు అధికారులు సభ్యులుగా ఉంటారు. జనవాడలో జీవో 111 నిబంధనలను ఉల్లంఘిస్తూ కేటీఆర్ ఫాం హౌస్ నిర్మించుకున్నారంటూ రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద ఎన్జీటీ విచారణ జరిపింది. అనంతరం దీనిపై విచారణకు కమిటీని నియమించింది. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించారని, స్విమ్మింగ్ పూల్ కూడా ఉందని, 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కేటీఆర్ దీన్ని నిర్మించారంటూ రేవంత్ రెడ్డి పిటిషన్‌లో ఆరోపించారు.

ఈ పిటిషన్‌పై రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాది శ్రవణ్ కుమార్ స్పందిస్తూ... ఎన్జీటీ నియమించిన కమిటీ కేటీఆర్ ఫాం హౌస్ మీద వచ్చిన ఆరోపణల మీద విచారణ జరుపుతుంది. ఆ కమిటీలో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు, నీటిపారుదల శాఖ, లేక్ ప్రొటెక్షన్ సొసైటీకి చెందిన వారు సభ్యులుగా ఉంటారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఆగస్ట్ 26కు వాయిదా పడింది.

2015 తర్వాత ఈ ఫాంహౌస్ నిర్మించినట్టు ఆరోపిస్తున్నారు కాబట్టి, అంతకు ముందు, ఆ తర్వాత అక్కడి కట్టడాలను తెలియజేసే గూగుల్ ఎర్త్ మ్యాప్స్ కూడా సేకరించనున్నారు. కమిటీ పూర్తిగా విచారణ జరిపి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదికను అందించనున్నారు. ఒకవేళ ఆ కట్టడం అక్రమం అయితే, అప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, పరిహారం ఎంత వసూలు చేయాలనే అంశాలను కూడా కమిటీ నివేదికలో పొందుపరచనుంది. మార్చి 1వ తేదీన తాను కేటీఆర్ ఫాం హౌస్‌ గురించి ప్రజలకు తెలియజేసేందుకు వెళితే తనను అరెస్ట్ చేశారంటూ ఎన్జీటీ ఎదుట దాఖలు చేసిన పిటిషన్‌లోరేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నార్సింగి పోలీసులు తన మీద కేసులు కూడా పెట్టారని తెలిపారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 6, 2020, 2:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading