కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో బీహార్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 40 లోక్సభ స్థానాలున్న బీహార్లో మెజార్టీ సీట్లు దక్కించుకుంటే అధికారానికి అంత చేరువ కావచ్చని పార్టీలు భావిస్తుంటాయి. అందుకే ఈసారి బీహార్లో ఎన్డీయే, యూపీఏ పక్షాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. మెజార్టీ సీట్లు దక్కించుకునేందుకు మండుటెండల్లోనూ చెమటోడ్చాయి. ఐతే బీహార్లో బీజేపీ-జేడీయూ కూటమే పట్టు నిలుపుకుందని News18-IPSOS ఎగ్జిట్ పోల్లో తేలింది. మెజార్టీ స్థానాలు ఎన్డీయే కూటమికే దక్కుతాయని వెల్లడయింది.
బీహార్లో 40 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఎన్డీయే కూటమిలో బీజేపీ 17, జేడీయూ 17, ఎల్జేపీ 6 స్థానాల్లో కలిసి కలిసి పోటీచేశాయి. ఇక్కడ తొలి విడత మొదలు కొని ఏడో విడత వరకు పోలింగ్ జరిగింది. ఐతే బీహార్లో ఎన్డీయేకు 34-36 సీట్లు దక్కవచ్చని News18-IPSOS ఎగ్జిట్పోల్లో తేలింది. ఆ కూటమిలో బీజేపీకి 15-17, జేడీయూకు 12-14, ఎల్జేపీకి 5-7 సీట్లు దక్కనున్నాయి. యూపీఏకు 4-6 సీట్లు మాత్రమే దక్కుతాయని వెల్లడయింది. యూపీఏ కూటమిలో కాంగ్రెస్ 0- 1, ఆర్జేడీ 2-4, ఆర్ఎల్ఎస్పీ 0-1 సీట్లు గెలుచుకుంటాయి. ఇతర పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేదు.
బీహార్ ఎగ్జిట్ పోల్
బీహార్
40
ఎన్డీయే
34-36
యూపీఏ
4-6
పార్టీల వారీగా
బీహార్
40
బీజేపీ
15-17
జేడీయూ
12-14
ఎల్జేపీ
5-7
కాంగ్రెస్
0-1
ఆర్జేడీ
2-4
RLSP
0-1
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.