news18-telugu
Updated: May 19, 2019, 6:37 PM IST
లగడపాటి రాజగోపాల్ సర్వే : టీఆర్ఎస్ 14 - 16, కాంగ్రెస్ 0 - 2, బీజేపీ 0 - 1, ఎంఐఎం 1
మూడు నెలల సుదీర్ఘ సమరం తుది అంకానికి చేరుకుంది. పార్టీల హామీలు.. విపక్షాల విమర్శలు.. నేతల ప్రచారం.. ఓటర్ల ఓట్లు.. ఇలా ప్రతీ క్షణం ఉత్కంఠగానే కొనసాగింది. ఈ వ్యవధిలో రాజకీయ నాయకులు తమ అస్త్రాలకు పదును పెట్టి ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. చివరగా నేటితో ఏడు దశల్లో ప్రజాస్వామ్య పండుగ విలసిల్లింది. ఇక మిగిలింది ఫలితాలే. ఆ ఫలితాలే మరో ఐదేళ్ల పాటు కుర్చీ ఎవరు అందుకోవాలని నిర్ణయిస్తాయి. అయితే, మహా సంగ్రామంలో కేంద్ర బిందువైన ఢిల్లీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని చూస్తే మరోసారి కమలం పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి. 6వ విడతలో ఎన్నికలు జరగ్గా ఆ పార్టీ 6-7 సీట్లు గెలిచే అవకాశాలున్నాయని న్యూస్18-ఇప్సాస్ ఎగ్జిట్ పోల్ చెబుతోంది. కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకునే అవకాశం లేకపోలేదని కూడా సర్వే సూచిస్తోంది. అయితే, ఢిల్లీ అధికార పార్టీ ఆప్ సున్నాకే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర పీఠానికి సెంటిమెంటు ఢిల్లీ..ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్సభ స్థానాల ఫలితాలు ఢిల్లీ పాలకులెవరనేది తేల్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. సీట్ల సంఖ్య తక్కువైనా ఢిల్లీ పాలకుడెవరనేది తేల్చడంలో దేశ ఓటరు నాడీకి ఇక్కడి ఓటర్లు నాడీ పట్టనున్నారు. 1998 పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లలో ఆరు సీట్లను కైవసం చేసుకొని అటల్ బిహారి వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఏర్పాటైంది. 1999లో బీజేపీ ఢిల్లీలోని అన్ని స్థానాల్లో విజయం సాధించింది. 2004 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆరుసీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ 46.40 శాతం ఓట్లు సాధించి ఏడు సీట్లను దక్కించుకుంది. కాగా, ఆ ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ పార్టీ అధిక స్థానాలు సాధిస్తోందో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
విడత - 6వ విడత
మొత్తం సీట్లు - 7
బీజేపీ 6-7
కాంగ్రెస్ 0-1ఆప్ 0
ఇతరులు 0
Published by:
Shravan Kumar Bommakanti
First published:
May 19, 2019, 6:37 PM IST