Home /News /politics /

NEWS18 IPSOS LOK SABHA ELECTION EXIT POLL BJP MAY GAIN LOK SABHA SEATS IN ODISHA BS

News18-IPSOS Exit Poll: ఒడిశాలో బీజేడీదే ఆధిక్యం.. పుంజుకోనున్న కమలం!

లగడపాటి రాజగోపాల్ సర్వే : టీఆర్ఎస్ 14 - 16, కాంగ్రెస్ 0 - 2, బీజేపీ 0 - 1, ఎంఐఎం 1

లగడపాటి రాజగోపాల్ సర్వే : టీఆర్ఎస్ 14 - 16, కాంగ్రెస్ 0 - 2, బీజేపీ 0 - 1, ఎంఐఎం 1

News18-Ipsos Exit Poll: ఈ సారి ఒడిశాలో బీజేడీకి సీట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఆధిక్యత కనబరుస్తున్నా ఆ పార్టీ 12-14 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. న్యూస్18-ఇప్‌సాస్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ 6-8 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
    సార్వత్రిక సమరం ముగిసింది. దాని ఫలితమే మిగిలింది ఇక. అధికార ఎన్డీయే, యూపీఏ ప్రతిపక్షాలు, ఇతర పార్టీలు ఇంకో పక్కన ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే, ఒడిశాలో రాజకీయ బలాబలాలను పరిశీలిస్తే మొత్తం 21 లోక్‌సభ సీట్లకు గాను బీజేడీ ఈ సారి 12-14 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. న్యూస్18-ఇప్‌సాస్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 6-8 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. ఇక, కాంగ్రెస్ ఒకే ఒక్క సీటు గెలిచే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ పార్టీ 20 సీట్లను దక్కించుకుంది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీ.. నవీన్ పట్నాయక్ నేతృత్వంలో దూసుకుపోయింది. ఒకే ఒక్క సీటు బీజేపీ కైవసం అయ్యింది. కానీ, ప్రస్తుతం పరిస్థతి మారేలా కనిపిస్తోంది.

    ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 21 లోక్‌సభ సీట్లకు గానూ తొలి నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ‘ఫణి’ తుఫాను ప్రభావంతో ఓటింగ్ శాతం తగ్గింది. మొత్తంగా 73.08 శాతం ఓటింగ్ నమోదైంది. నభరంగ్‌పూర్‌లో అత్యధికంగా 78.89 శాతం, అత్యల్పంగా భువనేశ్వర్‌లో 59.60 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    విడతలు తొలి నాలుగు విడతలు (4)
    మొత్తం సీట్లు 21
    బీజేడీ 12-14
    బీజేపీ 6-8
    కాంగ్రెస్ 1-2
    జేఎంఎం 0
    సీపీఐ 0
    సీపీఎం 0
    ఇతరులు 0
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Exit polls 2019, Lok Sabha Elections 2019, News18, Odisha, Odisha Assembly Election 2019, Odisha Lok Sabha Elections 2019

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు