news18-telugu
Updated: May 19, 2019, 7:20 PM IST
ప్రతీకాత్మక చిత్రం
News18-IPSOSExitPoll: గతంలో ఎప్పుడూ లేనంతగా కేరళ ఎన్నికలపై దేశవ్యాప్తంగా దృష్టి నెలకొంది. శబరిమల వివాదంతో పాటు వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీలో ఉండడమే దీనికి కారణం. ఇక్కడ యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్యే ప్రతిసారీ పోటీ ఉంటుంది. ఐతే ఈసారి ఎలాగైనా సత్తాచాటాలని బీజేపీ పట్టుదలతో ఎన్నికలో బరిలో దిగింది. శబరిమల వివాదం సహా పలు అంశాలు కేరళలో తమకు రాజకీయంగా కలిసొస్తాయని అంచనా వేసింది. కానీ ఆ అంచనాలు తప్పాయి. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే హోరాహోరీ ఉందని News18-IPSOS ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. కమలం పార్టీకి మళ్లీ నిరాశ తప్పదని స్పష్టంచేసింది.
మొత్తం 20 లోక్‌సభ స్థానాలున్న కేరళలో ఎల్డీఎఫ్ 11-13 స్థానాలు దక్కించుకోనుంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 7-9 స్థానాల్లో విజయం సాధించనుంది. ఎన్డీయే కూటమిలో బీజేపీకి 0-1 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశముందని తెలిపింది. ఎల్డీఎఫ్లో ఒక్క సీపీఎం పార్టీకే 11-13 స్థానాలు దక్కుతాయని News18-IPSOS ఎగ్జిట్ పోల్ అంచావేసింది. ఇక యూడీఎఫ్ కూటమిలో కాంగ్రెస్‌కు 4-6, ముస్లింలీగ్‌కు 1-3, ఆర్ఎస్పీకి 1-3 స్థానాల్లో గెలుస్తాయని వెల్లడించింది.
కేరళ |
20 |
ఎల్డీఎఫ్ |
11-13 |
యూడీఎఫ్ |
7-9 |
ఎన్డీయే |
0-1 |
పార్టీల వారీగా..
కేరళ |
మొత్తం 20 |
సీపీఎం |
11-13 |
కాంగ్రెస్ |
4-6 |
ముస్లిం లీగ్ |
1-3 |
ఆర్ఎస్పీ |
1-3 |
బీజేపీ |
0-1 |
మూడో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కేరళలోని మొత్తం 20 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కేరళలో మొత్తం ఓటర్ల సంఖ్య 2 కోట్ల 61 లక్షల మంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయడంతో కేరళ రాష్ట్రంపై అందరి దృష్టి నెలకొంది. కేరళలోని యూడీఎఫ్ కూటమి తరపున కాంగ్రెస్ 16, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2, కేరళ కాంగ్రెస్ 2, ఆర్ఎస్పీ 1 స్థానంలో పోటీ చేశాయి. ఇక ఎల్డీఎఫ్ కూటమి తరపున సీపీఎం 14, సీపీఐ 4, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో పోటీ చేశారు. కేరళలోని ఈ సారి ఎలాగైనా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది.
2014లో దేశంలోని చాలా రాష్ట్రాల్లో తక్కువ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ... కేరళలో మాత్రం 9 సీట్లను గెలుచుకుంది. సీపీఎం 5, సీపీఐ 1 స్థానం గెలుచుకోగా, ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధించారు. కానీ ఈసారి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ నెలకొంది.
First published:
May 19, 2019, 7:20 PM IST