Home /News /politics /

News18-IPSOS Exit Poll: ఏపీలో వార్ వన్ సైడ్ కాదు.. టీడీపీ, వైసీపీలకు వచ్చే సీట్లు ఇవే..

News18-IPSOS Exit Poll: ఏపీలో వార్ వన్ సైడ్ కాదు.. టీడీపీ, వైసీపీలకు వచ్చే సీట్లు ఇవే..

News18-IPSOS సర్వే : టీఆర్ఎస్ 11 - 13, కాంగ్రెస్ 1 - 2, బీజేపీ 1 - 2, ఎంఐఎం 1

News18-IPSOS సర్వే : టీఆర్ఎస్ 11 - 13, కాంగ్రెస్ 1 - 2, బీజేపీ 1 - 2, ఎంఐఎం 1

News18-IPSOS Exit Poll | టీడీపీకి 10 నుంచి 12, వైసీపీకి 13 నుంచి 14 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది.

    ఆంధ్రప్రదేశ్ వార్ వన్ సైడ్ కాదు. లోక్‌సభకు సంబంధించి టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ ఉన్నట్టు News18-IPSOS ఎగ్జిట్ పోల్‌లో తేలింది. సార్వత్రిక ఎన్నికల మీద న్యూస్‌18 దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎగ్టిట్ పోల్స్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి 10 నుంచి 12 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో వైసీపీకి 13 నుంచి 14 ఎంపీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉన్నట్టు న్యూస్‌18 ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తెలిసింది. News18-IPSOS ఎగ్జిట్ పోల్‌లో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వే ప్రకారం బీజేపీ ఒక్క సీటు దక్కించుకునే అవకాశం ఉంది.

    ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న తొలిదశలోనే ఎన్నికలు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 2014లో టీడీపీ 15 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ రెండుచోట్ల గెలిచింది. వైసీపీ 8 చోట్ల గెలుపొందింది. News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వే అంచనా ప్రకారం ఈసారి రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. అయితే, బీజేపీకి 0-1 సీటు వచ్చే అవకాశం ఉన్నట్టు సర్వేలో తేలింది.

    టీడీపీ 10 - 12
    వైసీపీ 11 - 13
    బీజేపీ 0 - 1
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Exit polls 2019, Lok Sabha Election 2019, News18

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు