2019 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ఏర్పాటు కావడం ఖాయమని
News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వేలో తేలింది. గతంలోకంటే భారీ మెజారిటీ కూడా రావడం ఖాయమని సర్వే అంచనాలు చెబుతున్నాయి. News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మే 12న వరకు ఆరు దశల పోలింగ్ పూర్తయింది. ఆరుదశల్లోనే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైనట్టు News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వేలో తేలింది. ఏడుదశల్లో మొత్తం 542 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో ఎన్డీయేకి 336 సీట్లు వస్తాయని News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వే అంచనా వేసింది. బీజేపీ సొంతంగా 276 సీట్లతో మెజారిటీ మార్క్ దాటుతుందని News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వేలో తేలింది. ఎన్డీయేలోని బీజేపీ మిత్రపక్షాలకు 60 సీట్లు వచ్చే చాన్స్ ఉంది. తూర్పు సముద్ర తీర రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతోపాటు కేరళ, తెలంగాణ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. యూపీ ఓటర్లు కూడా కమలం వైపే మొగ్గుచూపినట్టు News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వే ఫలితాల్లో తేలింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ బీజేపీ తిరుగులేని ఆధిక్యతను చాటే అవకాశం ఉందని సర్వే చెబుతోంది.
యూపీఏ పక్షాలకు తీవ్ర నిరాశ తప్పకపోవచ్చని News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఆరుదశలకు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో యూపీఏకి కేవలం 82 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో కాంగ్రెస్ పార్టీకి 46 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో యూపీఏ భాగస్వామ్యపక్షాలకు 60 సీట్లు వచ్చాయి. అందులో కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా యూపీఏ పక్షాలు గతంలో కంటే మెరుగుపడే అవకాశం ఉన్నట్టు News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
మొదటిదశలో ఎన్ని సీట్లు?
మొదటి దశలో మొత్తం 91 లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అందులో ఎన్డీయేకి 38-42 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది. అందులో బీజేపీకి 33-35 సీట్లు రావొచ్చే చాన్స్ ఉన్నట్టు సర్వేలో తేలింది.
రెండోదశలో ఎన్ని సీట్లు?
రెండోదశలో మొత్తం 95 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. అందులో ఎన్డీయేకి 50 నుంచి 54 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 27 నుంచి 29 సీట్లు వచ్చే చాన్స్ ఉంది.
మూడోదశలో ఎన్ని సీట్లు?
మూడోదశలో మొత్తం 116 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. అందులో ఎన్డీయేకి 71 నుంచి 75 సీట్లు రావొచ్చు. బీజేపీ 63 నుంచి 65 సీట్లు గెలిచే అవకాశం ఉంది.
నాలుగోదశలో ఎన్ని సీట్లు?
నాలుగోదశలో మొత్తం 72 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. అందులో ఎన్డీయే 53 నుంచి 57 సీట్లు సాధించే చాన్స్ ఉంది. బీజేపీకి 42 నుంచి 44 సీట్లు రావొచ్చు.
ఐదోదశలో ఎన్ని సీట్లు?
ఐదోదశలో ఎన్ని సీట్లు?
ఐదోదశలో మొత్తం 50 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. అందులో ఎన్డీయేకి 36 నుంచి 39 సీట్లు సాధించే అవకాశం ఉంది. బీజేపీకి 36 నుంచి 38 సీట్లు రావొచ్చు.
ఆరోదశలో ఎన్ని సీట్లు?
ఆరోదశలో మొత్తం 59 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. అందులో ఎన్డీయేకి 45 నుంచి 49 సీట్లు రావొచ్చు. బీజేపీకి 41 నుంచి 43 సీట్లు దక్కే అవకాశం ఉంది.
ఏడో దశలో ఎన్ని సీట్లు?
ఏడోదశలో
ఎన్డీయే 336
బీజేపీ 276
యూపీఏ 82
కాంగ్రెస్ 46
ప్రాంతీయ పార్టీలు 124
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.