news18-telugu
Updated: May 19, 2019, 8:12 PM IST
ప్రతీకాత్మక చిత్రం
డిసెంబరులో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో అధికారం కోల్పోయి చావు దెబ్బతింది. ఆ ఎన్నికలతో బీజేపీ ఖేత్ ఖతమ్ అని దేశమంతటా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో ఆ మూడు రాష్ట్రాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది బీజేపీ. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు కాంగ్రెస్‌కు ధీటుగా ప్రచారం నిర్వహించారు. ఐతే వారి ప్రయత్నాలు ఫలించినట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లు News18-IPSOS సర్వేలో తేలింది. ఆ మూడు రాష్ట్రాలను బీజేపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిందని ఎగ్జిట్ పోల్‌లో వెల్లడయింది.
రాజస్థాన్‌లో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. నాలుగు, ఐదు విడతల్లో ఇక్కడ పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో రాజస్థాన్‌ను కమలం పార్టీ క్వీన్ స్వీప్ చేయనుంది. బీజేపీకి 22-24 స్థానాలు దక్కగా.. కాంగ్రెస్ 2-3 సీట్లకు మాత్రమే పరిమితం కానుంది.
రాజస్థాన్ |
మొత్తం 20 |
బీజేపీ |
22-24 |
కాంగ్రెస్ |
2-3 |
మధ్యప్రదేశ్‌లో 29 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ నాలుగు, ఐదు, ఆరు, ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. 29 స్థానాల్లో వాటిలో బీజేపీకి 24-27 సీట్లు దక్కవచ్చని News18-IPSOS ఎగ్జిట్‌పోల్‌లో తేలింది. కాంగ్రెస్‌కు 2-4 సీట్లు మాత్రమే దక్కుతాయని వెల్లడయింది.
మధ్యప్రదేశ్ |
మొత్తం 29 |
బీజేపీ |
24-27 |
కాంగ్రెస్ |
2-4 |
చత్తీస్‌గఢ్‌లో 11 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇక్కడ తొలి, రెండు, మూడో విడతల్లో పోలింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లో కమలం పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలవబోతోంది. బీజేపీకి 7-9 లోక్‌సభ సీట్లలో విజయం సాధించనుంది. ఇక కాంగ్రెస్ 2-4 స్థానాలకే పరిమితం కానుంది.
చత్తీస్‌గఢ్ |
మొత్తం 11 |
బీజేపీ |
7-9 |
కాంగ్రెస్ |
2-4 |
తాము అధికారంలో ఉన్న ఈ మూడు రాష్టాలపైనే కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక్కడ మెజార్టీ స్థానాలను సాధిస్తే మోదీని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని భావించింది. కానీ కాంగ్రెస్
ఆశించిన ఫలితాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో రావడం లేదని News18-IPSOS ఎగ్జిట్ పోల్‌లో వెల్లడైంది. ఒకరకంగా కాంగ్రెస్‌కు ఇది పెద్ద ఎదురు దెబ్బే..!
Published by:
Shiva Kumar Addula
First published:
May 19, 2019, 7:14 PM IST