News18-IPSOS Exit Poll: తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు

News18-IPSOS Exit Poll: రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 18న జరిగిన తమిళనాడు లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉందని News18-IPSOSExitPoll‌లో వెల్లడైంది.

news18-telugu
Updated: May 19, 2019, 6:35 PM IST
News18-IPSOS Exit Poll: తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 19, 2019, 6:35 PM IST
తమిళనాడులో మొత్తం 39 స్థానాలు ఉండగా... 38 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. భారీ మొత్తంలో నగదు దొరకడంతో వేలూరు లోక్ సభ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 18న జరిగిన ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమికి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉందని News18-IPSOSExitPoll‌లోవెల్లడైంది.

డీఎంకే కూటమికి 22-24 సీట్లు
డీఎంకే 12-14

కాంగ్రెస్‌ 3-5
ఎండిఎంకే 1


వీసీకే 1-2
సీపీఐ 0-1
Loading...
ఐయుఎంల్ 0-1

అన్నాడీఎంకే కూటమికి 14-16 సీట్లు
అన్నాడీఎంకే 8-10
బీజేపీ 1-2
పీఎంకే 2-4
డీఎండీకే 1-2

2014లో అన్నాడీఎంకే హవా
2014లో తమిళనాడులో జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే హవా కొనసాగింది. ఆమె సారథ్యంలోని అన్నాడీఎంకే ఏకంగా 37 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ ఒక సీటు, పీఎంకే మరో సీటును సొంతం చేసుకున్నాయి. తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఆ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. అయితే ఆ తరువాత ముఖ్యమంత్రి ఉన్న జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. దీంతో ఈ సారి తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది.
First published: May 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...