News18-IPSOS Exit Poll: మహారాష్ట్రలో మరోసారి బీజేపీ-శివసేన హవా

News18-IPSOS Exit Poll: మహారాష్ట్రలో మరోసారి బీజేపీ శివసేన కూటమి హవా కొనసాగనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వే ప్రకారం బీజేపీ శివసేన కూటమికి 42-45 సీట్లు వస్తాయని వెల్లడైంది. కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి 4-6 సీట్లకు పరిమితం కానుంది.

news18-telugu
Updated: May 19, 2019, 6:30 PM IST
News18-IPSOS Exit Poll: మహారాష్ట్రలో మరోసారి బీజేపీ-శివసేన హవా
లగడపాటి రాజగోపాల్ సర్వే : టీఆర్ఎస్ 14 - 16, కాంగ్రెస్ 0 - 2, బీజేపీ 0 - 1, ఎంఐఎం 1
  • Share this:
మహారాష్ట్రలో మరోసారి బీజేపీ శివసేన కూటమి హవా కొనసాగనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో నాలుగు దశల్లో మొత్తం 48 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమికి అత్యధిక సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వే ప్రకారం బీజేపీ శివసేన కూటమికి 42-45 సీట్లు వస్తాయని వెల్లడైంది. కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి 4-6 సీట్లకు పరిమితం కానుంది.

బీజేపీ శివసేన కూటమి

బీజేపీ 21-23
శివసేన 20-22

కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి
కాంగ్రెస్ 0-1
ఎన్సీపీ 3- 5

2014 ఫలితాలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో 24 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 23 స్థానాల్లో విజయం సాధించింది. 20 స్థానాల్లో బరిలోకి దిగిన శివసేన 18 స్థానాల్లో గెలుపొందింది. 26 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 2 సీట్లలో విజయం సాధించగా... 21 సీట్లలో పోటీ చేసిన ఎన్సీపీ 4 స్థానాలను సొంతం చేసుకుంది. ఇక రెండు స్థానాల్లో పోటీ చేసిన స్వాభిమాని పక్షా ఒక సీటును గెలుచుకుంది.
Published by: Kishore Akkaladevi
First published: May 19, 2019, 6:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading