#News18IpsosExitPoll: మరాఠా పీఠం మళ్లీ బీజేపీ కూటమిదే..

ఎన్సీపీ 22 సీట్లలో విజయం సాధిస్తుందని.. కాంగ్రెస్‌కు 17 సీట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పార్టీ ఎంఐఎం ఒక సీటు దక్కవచ్చని News18-Ipsos ఎగ్జిట్ పోల్‌లోతేలింది.

news18-telugu
Updated: October 21, 2019, 6:42 PM IST
#News18IpsosExitPoll: మరాఠా పీఠం మళ్లీ బీజేపీ కూటమిదే..
న్యూస్ 18 క్రియేటివ్
news18-telugu
Updated: October 21, 2019, 6:42 PM IST
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ-శివసేన కూటమిదే విజయమని News18-Ipsos ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మూడింట రెండొంతుల స్థానాల్లో గెలిచి బీజేపీ కూటమి మరోసారి అధికారం చేపడుతుందని వెల్లడించింది. మొత్తానికి వార్ వన్ సైడేనని తేల్చేసింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఏకంగా 243 సీట్లు బీజేపీ-శివసేన కూటమికే వస్తాయని స్పష్టంచేసింది. బీజేపీకి 141, శివసేనకు 102 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి కేవలం 41 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడింది. ఎన్సీపీ 22 సీట్లలో విజయం సాధిస్తుందని.. కాంగ్రెస్‌కు 17 సీట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పార్టీ ఎంఐఎం ఒక సీటు దక్కవచ్చని News18-Ipsos ఎగ్జిట్ పోల్‌లో తేలింది.

First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...