NEWS OF RESIGNATIONS UNTRUE CONGRESS CONDEMNS MEDIA CAMPAIGN SNR
కాంగ్రెస్ పెద్దల రాజీనామా వార్త అవాస్తవం..జాతీయ మీడియాపై రణదీప్ సుర్జేవాలా ఫైర్
ప్రియాంక, రాహుల్, సోనియా(ఫైల్ ఫోటో)
Untrue: కాంగ్రెస్ హైకమాండ్‌లోని కీలక వ్యక్తులు రాజీనామా చేస్తున్నారంటూ ఓ జాతీయ మీడియా చేసిన ప్రచారం సంచలనం రేపింది. అయితే ఇదంతా వాస్తవం కాదని..పూర్తి అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినాయకత్వం సంచలన నిర్ణయం తీసుకోనుందని ఓ జాతీయ మీడియా వార్తను ప్రచూరించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీ సీనియర్ నాయకుల నుంచి వస్తున్న అసంతృప్త స్వరాన్ని బట్టి జాతీయ అధినాయకత్వంలో ఉన్న పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(Sonia Gandhi), ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీవాద్రా(Priyanka Gandhi)తమ పదవులకు రాజీనామా( Resignation)చేయాలన్న యోచనలో ఉన్నట్లుగా వార్తను ఓ జాతీయ మీడియా చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్ ఖండించింది. ఫలితాల తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆదివారం జరిగే సమావేశంలో రాజకీనామాల నిర్ణయాన్ని వెల్లడించాలని నిర్ణయించుకున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్ ద్వారా కొట్టిపారేశారు. సంచలనం రేపిన ఈ వార్త కేవలం పుకారు మాత్రమే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఐదు రాష్ట్రాల(Five states)అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ(As a moral obligation) కాంగ్రెస్ అధినాయకత్వం మూకుమ్మడిగా రాజీనామాలు చేయలని నిర్ణయం తీసుకుందని జాతీయ మీడియా వార్తల్లో వాస్తవం లేదని తేల్చింది కాంగ్రెస్ పార్టీ.
తప్పుడు ప్రచారమేనంట..
కాంగ్రెస్‌లో రాజీనామాల వార్త చూసి షాకైన పార్టీ నేతలు ఇది కేవలం ఊహాగానమేనంటూ కొట్టిపారేశారు. ఆ వార్త ఊహాజనితమే కాకుండా సత్య దూరమైనదని వివరణ ఇచ్చారు. పార్టీ వర్గాలు అంటూ ఆ వార్తను రాశారంటూ జాతీయ మీడియాపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఈ వార్తను కొట్టేస్తూ మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్గాలు అంటూ జాతీయ మీడియా అసత్య వార్తను ప్రచురించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రచారం తగదని సూచించారు.
The news story of alleged resignations being carried on NDTV based on unnamed sources is completely unfair, mischievous and incorrect.
It is unfair for a TV channel to carry such unsubstantiated propaganda stories emanating from imaginary sources at the instance of ruling BJP.
వెనక్కి వెళ్లి చూస్తే ..
కాంగ్రెస్ ఓటమి పాలైన మాట వాస్తవమే. గత కొన్ని ఎన్నికల నుంచి అధినాయకత్వంలో ఎవరు ఎన్నికల బాధ్యతలు తీసుకున్నప్పటికి ఫలితాలు పాజిటివ్‌గా రావడం లేదని అందరికి అర్ధమైపోయింది. 2014లో సోనియాగాంధీ, 2019లో రాహుల్‌గాంధీ, ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకగాంధీ వాద్రా ప్రచార బాధ్యతలు ఎవరు తీసుకున్నప్పటికి ఫలితాలు ఒకే తీరుగా రావడం వల్లే ఇలాంటి ప్రచారం జరిగి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.