గజ్వేల్ బ్యాంక్ ఉద్యోగి దివ్య హత్య కేసులో ట్విస్ట్

Divya Murder Case: హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వేములవాడకు చెందిన వెంకటేష్‌తో దివ్యకు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగినట్లు సమాచారం.

news18-telugu
Updated: February 19, 2020, 1:43 PM IST
గజ్వేల్ బ్యాంక్ ఉద్యోగి దివ్య హత్య కేసులో ట్విస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గజ్వేల్‌లో దారుణ హత్యకు గురైన బ్యాంక్ ఉద్యోగి దివ్య హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వేములవాడకు చెందిన వెంకటేష్‌తో దివ్యకు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగినట్లు సమాచారం. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో వెంకటేష్‌ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించకపోవడంతో వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పెళ్లి సమయంలో దివ్య మేజర్‌ కాకపోవడంతో ఆమెను తల్లిదండ్రులు... హాస్టల్‌లో ఉంచి చదివించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు  దివ్యను వెంకటేష్‌ వేధించాడని, చివరకు ఈ వ్యవహారం పంచాయితీ వరకూ వెళ్లిందని... దీంతో దివ్య జోలికి రానంటూ వెంకటేష్‌ హామీ పత్రం రాసిచ్చినట్లు సమాచారం.

ఆ తర్వాత దివ్యకు గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (ఏపీజీవీబీ)లో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వరంగల్‌కు చెందిన సందీప్‌ అనే యువకుడితో వివాహం నిశ్చయించారు. ఈనెల 26న వారి దివ్య, సందీప్ పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దివ్యకు బ్యాంక్‌ ఉద్యోగం రావడంతో పాటు, మరో వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో కసి పెంచుకున్న వెంకటేషే.. దివ్యను ఎలా అయిన అంతం చేయాలనుకున్నాడు. ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్లి వచ్చిన దివ్య మేడపై ఆరేసిన బట్టలు తీసేందుకు డాబాపైకి వెళ్లింది. కిందికి దిగుతుండగా వెంకటేశ్‌ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి.. శరీరంపై 15 పోట్లు పొడిచి పరారయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలిన దివ్య స్పాట్‌లోనే ప్రాణాలు విడిచింది.

ఈ ఘోరానికి పాల్పడి వుంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేములవాడలోని వెంకటేష్ ఇంటికి తాళం వేసి ఉండటంతో ... పోలీసులు వారి గురించి గాలించారు. నిందితుడు వెంకటేశ్ తల్లిదండ్రులను రాజన్న సిరిసిల్లా జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. వారిని సిద్దిపేట జిల్లాకు తరలించారు. అటు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడు వెంకటేశ్ ను అరెస్ట్ చేసే వరకు దివ్య మృతదేహాన్ని తరలించేది లేదని కుటుంబసభ్యులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు వారికి సర్ది చెప్పారు.

 

First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు