• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • NEW TENSION FOR TRS DUE TO PONGULETI SRINIVASA REDDY COMMENTS IN KHAMMAM DISTRICT AK

Telangana: టీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. అలా జరిగితే.. బీజేపీకి కొత్త జోష్

Telangana: టీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. అలా జరిగితే.. బీజేపీకి కొత్త జోష్

బండి సంజయ్, సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటోలు)

Khammam Politics: వరంగల్‌తో పాటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉన్న సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరకమైన వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే దానిపై ఖమ్మం రాజకీయవర్గాల్లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.

  • Share this:
    తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అనూహ్య విజయాలతో ఊపు మీదున్న బీజేపీ.. తమకు అంతగా పట్టులేని ప్రాంతాల్లో విస్తరించేందుకు బలమైన నేతలపై కన్నేసినట్టు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో సత్తా చాటేందుకు ఆ పార్టీ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై దృష్టి పెట్టిందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. 'తాను ప్రజా ప్రతినిధిని కానని.. ఎవరికీ చెప్పి లేదా ఎవరి అనుమతి తీసుకుని పర్యటనలు చేయాల్సిన అవసరం లేదంటూ.. ప్రజాభిమానమే తనకు పదవి అంటూ.. వచ్చే రోజున ఏదీ ఆగదని, పోయేది చెప్పి పోదని చెప్పారు. తన అభిమానులను వేధించే ఎవరైనా దీనికి ప్రతిఫలం చెల్లించాల్సిందేనని, అదీ చక్రవడ్డీతో చెల్లిస్తారు' అని పరోక్షంగా టీఆర్ఎస్‌లోని కొందరు నేతలను హెచ్చరించారు.

    అయితే వరంగల్‌తో పాటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉన్న సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరకమైన వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే దానిపై ఖమ్మం రాజకీయవర్గాల్లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. జిల్లావ్యాప్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఓ వర్గం ఉంది. ఆయన బీజేపీలోకి వెళితే.. జిల్లాలో బీజేపీని ముందుకు నడిపించే అవకాశం ఆయనకే దక్కే అవకాశం ఉంటుందని.. ఈ కారణంగానే ఆయన అటు వైపు చూస్తున్నారేమో అనే చర్చ కూడా సాగుతోంది. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నా.. టీఆర్ఎస్ నాయకత్వం తనకు పదవులు ఇచ్చే విషయంలో అలసత్వం వహిస్తోందనే భావన శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన వర్గంలో బలంగా ఉంది.

    పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వార్తలు,ఖమ్మం వార్తలు,పొంగులేటి రియాక్షన్,టీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి,ponguleti srinivas reddy,ponguleti news,ponguleti mlc seat,
    పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Image: Facebook)


    దీనికి తోడు జిల్లాలోని ఇతర ముఖ్యనేతలు తమ వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారనే భావనలో పొంగులేటి ఉన్నారు. ఈ కారణంగానే ఇబ్బందిగా ఉన్న చోటు ఉండటం ఎందుకని ఆయన అనుచరవర్గం ఆయనపై ఒత్తిడి చేస్తోందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే పొంగులేటి మాత్రం ఈ విషయంలో వారిని సముదాయిస్తున్నారని సమాచారం. ఇక నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలను బట్టి పొంగులేటి టీఆర్ఎస్‌ను వీడే అంశంపై కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదనే టాక్ కూడా వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: