M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18
TDP Chief Chandra Babu Naidu: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయడు (Chandra Babu Naidu)కి తలనొప్పినిగా మారుతోంది కుప్పం (Kuppam) వ్యవహారం. సొంత నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ(YSRCP ) పాగా వేయడంతో.. వచ్చే ఎన్నికలకు ముందే డేంజర్ బెల్ లా మారింది. మరి వచ్చే ఎన్నికల్లో బాబు కుప్పం నుంచి గట్టెకేనా.... డీలా పడేనా అన్నది ఆసక్తిగా మారింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి (EX Chief Minster) ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పరిస్తిస్తులు మారుతున్నాయి. 1989 నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబు ఓటమి లేకుండా... ఆ నియోజకవర్గంలో వరుసగా ఆరు సార్లు గెలిచినా చంద్రబాబుకు.... 7వ సారి ఓట్ల శాతం దగ్గిందనే చెప్పుకోవాలి. చంద్రబాబు కుప్పంకు వెళ్లకపోయినా.. నామినేషన్ ఆయన పేరుతో వేరే వారు వేసినా.. విజయం మాత్రం ఆయనదే. చంద్రబాబుపై ఎంతో నమ్మకం ఉన్న కుప్పం ప్రజలు ఎమ్మెల్యేగా బాబుని తప్ప మరెవ్వరిని గెలిపించే వారు కాదు. కానీ 2019 ఎన్నికల తరువాత జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆది నుంచి ఆధిక్యం ప్రదర్శించే చంద్రబాబు.. గత ఎన్నికల్లో మాత్రం మొదటి రెండు రౌండ్లలో వెనుకంజలోకి వెళ్లడం అప్పట్లో సంచలనంగా మారింది. సార్వత్రిక ఎన్నికల తరువాత పంచాయితీ ఎన్నికలు జరిగాయి. కుప్పంలోని 89 పంచాయితీల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం 14 స్థానాల్లోనే సర్దిపెట్టుకోవాల్సి వచ్చింది. అధికార వైసీపీ పార్టీ తన సత్త చాటి 74 పంచాయితీలను కైవసం చేసుకుంది. దింతో గట్టి షాక్ తిన్న బాబు.. హడవిడిగా మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించారు. అక్కడే మకాం వేసి., పార్టీ కార్యకర్తలు....గ్రామా స్థాయి నేతల నుంచి నియోజకవర్గ నేతల వరకు పేరుపేరునా పలకరించారు. చంద్రబాబు పర్యటనతో మునుపటి రోజులు కుప్పంలో వచ్చాయి అంత భావించారు. ఇంతలోనే జిల్లా పరిషత్ ఎన్నికలు మరో షాక్ తగిలేలా చేశాయి.
ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. చిత్తూరు జిల్లాలో టీడీపీ పార్టీ లేకుండా చేయాలనే సంకల్పంతో అధికార వైసీపీ పార్టీ కంకణం కట్టుకుంది. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minster Peddireddy Ramachandra Reddy) నేతృత్వంలో అక్కడ వైసీపీ శ్రేణులు పక్కాగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కుప్పంలో చంద్రబాబుకు స్థానం లేకుండా చేయాలనే లక్ష్యంతో పెద్దిరెడ్డి నిరంతరం కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఇదీ చదవండి: ఈ నెల 24వ తేదీన మోదీ-బైడెన్ భేటీ.. ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అంశాలు ఇవే
టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలను ప్రోత్సహించడం, ప్రభుత్వ పథకాల విషయంలో కాస్త లిబరల్ గా వ్యవహరించడం ద్వారా టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు పెద్దిరెడ్డి. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఫలితాలు రావడానికి ఈ ఎఫెక్టే కారణమని విశ్లేషకుల నుంచి అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
మూడు రోజుల పర్యటనలో బాబు వ్యాఖ్యలను కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారట. నియోజవర్గంలో చంద్రబాబు ప్రతినిధులుగా ఉన్న మనోహర్, ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులపై కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారని సమాచారం. మనోహర్ ను పార్టీ నుంచి తొలగించాలని చంద్రబాబు ముందే కార్యకర్తలు బాహాబాహీకి దిగినట్లు సమాచారం. ఈ విషయంపై స్పదించని చంద్రబాబు పార్టీ కార్యకర్తల గోడు పట్టించుకోలేదట. కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు ఎదురు సమాధానం చెప్పారట బాబు.
ఇదీ చదవండి: జెట్ వేగంతో దూసుకొస్తున్న మహమ్మారి.. ఎయిర్ బార్న్ డిసీజ్ గా మారే ప్రమాదం
మనోహర్ లేకుంటే మీలో ఎవరు ఆ బాధ్యతలు చూస్తారని అడిగేశారనే టాక్ నడుస్తోంది. అంతా సెట్ చేస్తుందనుకున్న బాబు మూడురోజుల టూర్ కాస్త మూన్నాళ్ళ ముచ్చటగా మారిందని పార్టీ వర్గాల్లో వినికిడి. స్థానిక నాయకత్వం పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు వ్యవహరించడం లేదంటే అసలు పట్టించుకోకపోవడం చేస్తోందట.
మరికొందరు పెద్దిరెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ లో వైసీపీ కండువాలు కప్పుకొన్నారు. వీరిలో కొంత మంది కీలక నేతలు కూడా ఉన్నారట. ఎంత ఎన్నికలను బహిష్కరించినా.. చంద్రబాబు కోటలో టీడీపీ అంటే టీడీపీలానే ఉండాలి కదా.. కానీ అలా జరగలేదు. పార్టీ వద్దాన్నాక పోటీ ఎందుకులే అనుకున్నారో లేక పోటీ చేయడం ఇష్టం లేదో కానీ… పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు.
ఇదీ చదవండి: మీలో ఫిట్ నెస్ తగ్గిందని ఇలా తెలుసుకోండి.. శరీరాకృతి మారిందని తెలిపే సంకేతాలు ఇవే!
పార్టీ పై మమకారం, బాబుపై అభిమానం ఉన్న 44 మంది పోటీ చేసినా ఫలితాలు అనుకూలంగా లేకపోవడం కుప్పం నాడిని తెలియజేస్తోంది. ఇది ఈ ఎన్నికల వరకే పరిమితం అయితే పర్లేదు.. కానీ వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఉంటుందా అనే ప్రశ్న పార్టీ కార్యకర్తల్లో నడుస్తోంది. ఎన్నికలను బహిష్కరించకుండా టీడీపీ బరిలోకి దిగితే కుప్పంలో ఫలితాలు ఎలా ఉండేవో ఏమో కానీ.. పార్టీ తరఫున అంటూ పోటీ చేసిన 44 మంది ఎంపీటీసీ అభ్యర్ధులు.. చంద్రబాబు పునరాలోచనలో పడేలా చేసిందట. ఇలానే అయితే చంద్రబాబు గెలుపు కుప్పంలో సాధ్యం కాదు అని అంటున్నారు విశ్లేషకులు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, TDP, Ycp