Home /News /politics /

NEW TENSION FOR BJP IN HUZURABAD BY ELECTIONS DUE TO ETELA RAJENDAR AK

Huzurabad By Elections 2021: హుజూరాబాద్‌లో బీజేపీకి కొత్త టెన్షన్.. ఈటల రాజేందర్ కారణమా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad: హుజూరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య జరిగే ఈ పోటీ హోరాహోరీగా ఉంటుందని.. అందుకే తమకు పడే ప్రతి ఓటు కూడా ముఖ్యమని నేతలు భావిస్తున్నారు.

    మరికొద్ది వారాల్లోనే జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉంటుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్(Etela Rajendar) తన సొంత ఇమేజ్‌ను నమ్ముకుని బరిలోకి దిగుతుండగా.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మంత్రి హరీశ్ రావు(Harish Rao) మంత్రాంగం తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ నమ్ముతోంది. టీఆర్ఎస్(TRS) అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్‌(Huzurabad)లోనే మకాం వేసి కష్టపడుతున్నారు. అయితే ఎన్నికల్లో కొందరు ఇండిపెండెంట్లకు కేటాయించిన గుర్తులు టీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్నాయి. అందులో రోడ్ రోలర్ గుర్తుతో పాటు మరో గుర్తు కూడా ఉంది.

    ఈ రెండు గుర్తు కారణంగా గతంలో పలుసార్లు ఎన్నికల్లో టీఆర్ఎస్ దెబ్బతింది. దీంతో ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. టీఆర్ఎస్‌ను కొన్ని గుర్తులు ఇబ్బంది పెడుతుంటే.. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు మరో ఇబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. 15 ఏళ్లకు పైగా టీఆర్ఎస్‌లో కొనసాగి.. ఆ పార్టీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్.. ఇప్పుడు బీజేపీలో చేరిపోయారు.

    గతంలో అనేకసార్లు తన గుర్తు కారు గుర్తు అని ప్రజలకు చెప్పిన ఈటల రాజేందర్ అంటే ఇక్కడి ప్రజలకు కారు గుర్తు ఎక్కువగా గుర్తుకు వస్తుందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గ్రామాల్లోని కొందరు వృద్ధులు, మహిళలు.. ఇప్పటికీ ఈటల రాజేందర్ కారు గుర్తు మీదే పోటీ చేస్తున్నారని భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలు, ఈటల రాజేందర్ తన ఎన్నికల ప్రచారంలో పువ్వు గుర్తును ప్రముఖంగా ప్రస్తావిస్తున్నప్పటికీ.. కొందరు ఈ విషయంలో తికమకపడి కారు గుర్తుకు ఓటు వేస్తారేమో అనే టెన్షన్ బీజేపీ వర్గాల్లో నెలకొన్నట్టు తెలుస్తోంది.

    Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

    YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

    బీజేపీ, టీఆర్ఎస్ మధ్య జరిగే ఈ పోటీ హోరాహోరీగా ఉంటుందని.. అందుకే తమకు పడే ప్రతి ఓటు కూడా ముఖ్యమని నేతలు భావిస్తున్నారు. ఈ కారణంగానే ప్రజలు తికమకపడి ఓటు వేయకుండా ఉండేందుకు ఈటల రాజేందర్ అనుచరులు, బీజేపీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లి.. ఈటల రాజేందర్‌ది పువ్వు గుర్తు అని వివరిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థికి కాలీఫ్లవర్ గుర్తు కేటాయించడం కూడా బీజేపీకి ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Etela rajender, Huzurabad By-election 2021, Minister Etela, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు